అంతర్జాతీయ అక్షరాస్యత దినోత్సవం”
1 min read
కర్నూలు, న్యూస్ నేడు: రాష్ట్ర న్యాయ సేవాధి కార సంస్థ ఆదేశాల మేరకు కర్నూలు,జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి బి.లీలా వెంకట శేషాద్రి గారు కల్లూరు నందలి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో అంతర్జాతీయ అక్షరాస్యత దినోత్సవాన్ని జాగృతి స్కీమ్ 2025 సభ్యులతో కలిసి ఘనంగా నిర్వహించారు.జడ్జి మాట్లాడుతు ప్రకృతి ని పర్యావరనాన్ని ప్రతి ఒక్కరూ కాపాడాలని కోరారు. అంతర్జాతీయ అక్షరాస్యత దినోత్సవం 2026 ఈ ప్రపంచ వ్యాప్త ఆచరణ యొక్క 60 వ వార్షికోత్సవాన్ని సూచిస్తూ “ప్రజలు గ్రహం మరియు శ్రేయస్సు కోసం అక్షరాస్యత” అనే థిమ్ తో ఈ సెప్టెంబర్ 8న జరుపు కుంటున్నామని తెలిపారు. విద్యార్థులకు ప్రాథమిక హక్కులు, అటవీ హక్కులు, కాలుష్య నివారణ మరియు కార్మిక హక్కులు, కనీస వేతనాలు, వినియోగదారుల రక్షణ మొదలగు చట్టలపై అవగాహన కల్పించారు. ఈ సమావేశంలో కళాశాల రీజినల్ ఇన్స్పెక్టింగ్ ఆఫీసర్ లాలప్ప, కర్నూలు,డిప్యూటీ కమిషనర్ ఆఫ్ మున్సిపల్ కార్పొరేషన్ సతీష్ కుమార్ రెడ్డి, కల్లూరు మండల విద్యాధికారి శ్రీనివాసులు, డిస్టిక్ చైల్డ్ వెల్ఫేర్ ఆఫీసర్ శారద, వెల్ఫేర్ హాస్టల్ అధికారి మద్దిలేటి, ఎన్జీవో రాయపాటి శ్రీనివాసులు, న్యాయవాదులు వెంకట్రావు రాంపుల్లయ్య, డిప్యూటీ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ సులోచన, జడ్పీ హైస్కూల్ హెడ్మాస్టర్ హుస్సేన్, ప్యారా లీగల్ వాలెంటీర్ హేమంత్ కుమార్ మొదలగువారు పాల్గొన్నారు.


