పంటల అధిక దిగుబడిపై.. పల్లెల్లో అవగాహన
1 min read

న్యూస్ నేడు నందికొట్కూరు: పంటల అధిక దిగుబడిపై పల్లెల్లో రైతులకు వ్యవసాయ శాఖ అధికారులు అవగాహన కల్పించారు.నంద్యాల జిల్లా నందికొట్కూరు మండల పరిధిలోని శాతనకోట, అల్లూరు,మల్యాల గ్రామాల్లో మండల వ్యవసాయ అధికారి పి షేక్షావలి అధ్యక్షతన గురువారం రైతులకు అవగాహన కల్పించారు. కేంద్ర వ్యవసాయ మంత్రిత్వ శాఖ మరియు భారత వ్యవసాయ పరిశోధన మండలి సంయుక్తంగా ఆద్వర్యంలో కృషి విజ్ఞాన కేంద్రం యాగంటిపల్లె ద్వారా వికసిత కృషి సంకల్ప అభియాన్ కార్యక్రమం (వికే ఎస్ఏ)రైతులు శాస్త్రీయ సలహాలు పాటించి పెట్టుబడి ఖర్చు తగ్గించుకొని వ్యవసాయం లాభసాటిగా మార్చుకోవాలనిభారతీయ వ్యవసాయ పరిశోధన మండలి శాస్త్రవెత్త, డా.శ్రీనివాసు మరియు కేవీకే శాస్త్రవెత్తలు బాలరాజు,రవి గౌడ్ పాల్గొని ఖరీఫ్ ముందు చేపట్టాల్సిన సన్నద్దత కార్యక్రమాలపై వివరించారు. ఇందులో భూసార ఆధారిత ఎరువుల యాజమాన్యం మరియు ప్రస్తుత పంటల్లో వేయాల్సిన ఎరువుల మోతాదును గురించి వివరించారు. మొక్కజొన్న,కంది,వరి, సోయబీన్,పంటల్లో సస్యరక్షణ చర్యలైన విత్తన శుద్ధి, తెగుళ్ళు,పురుగు మందుల యాజమాన్య పద్ధతులపై అవగాహన కల్పించారు.అలాగే వ్యవసాయ శాఖ అందిస్తున్న ప్రభుత్వ పథకాలపై అవగాహన కల్పించారు.ఉద్యాన పంటల్లో అధిక దిగుబడులు పొందాలంటే మేలైన రకాల ఎంపిక అవసరం అన్నారు. ప్రస్తుతం చేపట్టాల్సిన యాజమాన్య పద్ధతులను వివరించారు. ఈ కార్యక్రమానికి ఐసీఏఆర్ శాస్త్రవెత్త డా.శ్రీనివాస్,కేవీకే శాస్త్రవెత్త బాలరాజు,రవిగౌడ్, డీఆర్సీ హేమలత,ఉద్యాన అధికారి తేజస్విని,రైతు సేవా కేంద్రాల సిబ్బంది మరియు రైతులు పాల్గొన్నారు.

