” మహిళల హక్కులు, రక్షణ పై అవగాహన సదస్సు”
1 min read
కర్నూలు , న్యూస్ నేడు: సుప్రీంకోర్టు ఆఫ్ ఇండియా ఆదేశాల మేరకు కర్నూలు,జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి బి.లీలా వెంకట శేషాద్రి మరియు శాశ్వత లోక్ అదాలత్ చైర్మన్ వెంకట హరినాథ్ లు జిల్లా న్యాయ సేవా సంస్థ నందు మహిళా శిశు సంక్షేమ శాఖ మరియు లా కాలేజీ మరియు ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ వారి సహకారంతో మహిళల హక్కులు రక్షణ మరియు లింగ సమానత్యం మరియు మహిళలకు సంబంధించిన ప్రాథమిక హక్కులు పై వన్ స్టాఫ్ సెంటర్ సిబ్బంది కి, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ వారికి, మహిళా పోలీసులకు, పోలీసులకు, లా కాలేజీ స్టూడెంట్ లకు,ఎన్జీవోలకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా లీలా వెంకట శేషాద్రి మాట్లాడుతూ మహిళలకు చట్టపరంగా కీలకమైన రక్షణలు, హక్కులు ఉన్నాయని తెలిపారు. గృహహింస నిరోధక చట్టం, 2005 ప్రకారం కుటుంబ సభ్యులు లేదా జీవిత భాగస్వామి నుండి శారీరక మానసిక ఆర్థిక వేధింపుల నుండి మహిళలకు రక్షణ కల్పిస్తుందని తెలిపారు. వరకట్న నిషేధ చట్టం 1961 ద్వారా కట్నం తీసుకోవడం లేదా ఇవ్వడం చట్టపకారం నేరమని తెలిపారు. వరకట్నం వేధింపులకు కఠిన శిక్షలు ఉన్నాయని తెలిపారు. లీగల్ ఎయిడ్ మెంబర్ డాక్టర్ రాయపాటి శ్రీనివాస్ మాట్లాడుతూ విద్య మరియు ఉద్యోగములలో అబ్బాయిలతో సమానంగా అమ్మాయిలకు కూడా సమాన అవకాశాలు కలవని తెలిపారు. ప్రాథమిక హక్కు ఆర్టికల్ 14 ప్రకారం చట్టం ముందు అందరూ సమానులే మరియు చట్టం అందరికీ సమాన రక్షణ కల్పిస్తుంది అని తెలిపారు.ఈ సదస్సులో శాశ్వత లోక్ అదాలత్ చైర్మన్ వెంకట హరినాథ్,మహిళా శిశు సంక్షేమ శాఖ ఇంచార్జి ప్రాజెక్టు డైరెక్టర్ నారాయణమ్మ ,లీగల్ ఎయిడ్ మెంబర్ డాక్టర్ రాయపాటి శ్రీనివాస్, వన్ స్టాప్ సెంటర్ సిబ్బంది, మహిళా పోలీసులు, లీగల్ టీం సభ్యులు, పోలీసులు, ఎన్జీవోలు, లా కాలేజీ స్టూడెంట్స్ పాల్గొన్నారు.


