NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

శ్రీశైలం జల నిర్వహణపై ముఖ్యమంత్రికి రాయలసీమ సాగునీటి సాధన సమితి లేఖ

1 min read

KRMB, CWC క్రియారాహిత్యంపై కేంద్రంతో ముఖ్యమంత్రి రాజకీయ, దౌత్యపరమైన చొరవ చూపాలి!

రాయలసీమ శాశ్వత జలభద్రతకు తక్షణమే విధానపరమైన నిర్ణయాలు తీసుకోవాలి

ముఖ్యమంత్రికి లేఖ రాసిన సమితి అధ్యక్షులు బొజ్జా దశరథరామిరెడ్డి

కర్నూలు, న్యూస్​ నేడు: వాతావరణ మార్పులు, ఎల్‌నినో ప్రభావంతో రాయలసీమలో తీవ్రతరమవుతున్న తాగునీరు, సాగునీటి సంక్షోభానికి శాశ్వత పరిష్కారం చూపాలని కోరుతూ, శ్రీశైలం జలాశయ నిర్వహణపై తక్షణ విధానపరమైన నిర్ణయాలు తీసుకోవాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడుకు రాయలసీమ సాగునీటి సాధన సమితి లేఖ రాసింది.ఈ లేఖను గురువారం కర్నూలులో జలవనరుల శాఖ డిప్యూటీ చీఫ్ ఇంజనీర్ మహేష్ కి సమితి అధ్యక్షులు బొజ్జా దశరథరామిరెడ్డి అందజేసి, సమస్య తీవ్రతను వివరించారు.

వర్షాభావంతో రైతాంగం కుదేలు – శ్రీశైలం నీటి సంరక్షణలో వైఫల్యం

2026 ఖరీఫ్‌లో జూన్, జూలై వర్షాలతో రైతులు ఆరుతడి పంటలు, వరి నారుమళ్లు సాగు చేసినప్పటికీ, ఆగస్టు నుంచి వర్షాలు నిలిచిపోవడంతో నారుమళ్లు ఎండిపోయి, వరి నాట్లు కూడా వేయలేని పరిస్థితి ఏర్పడిందని తెలిపారు. సాధారణ దిగుబడిలో 10–20 శాతం కూడా వచ్చే పరిస్థితి లేదని ఆవేదన వ్యక్తం చేశారు.రాయలసీమ ప్రజలకు తాత్కాలిక పంట నష్టపరిహారం మాత్రమే కాదు, ప్రతి కరువు సమయంలో తాగునీరు, సాగునీటి కోసం ఆందోళన చెందాల్సిన పరిస్థితి నుంచి శాశ్వత విముక్తి కావాలని బొజ్జా దశరథరామిరెడ్డి స్పష్టం చేశారు. శ్రీశైలం జలాశయాన్ని సమగ్రంగా నిర్వహిస్తూ రాయలసీమకు శాశ్వత జలభద్రత కల్పించేలా ముఖ్యమంత్రి తక్షణ కార్యాచరణ చేపట్టాలని విజ్ఞప్తి చేశారు.ఈ కార్యక్రమంలో సమితి ఉపాధ్యక్షులు వాడాల చంద్రశేఖర్ రెడ్డి, రామకృష్ణారెడ్డి, నిట్టూరు సుధాకర్ రావు పాల్గొన్నారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *