NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

కర్నూలు మండల కాంగ్రెస్ అధ్యక్షురాలుగా బి హైమావతి

1 min read

న్యూస్ నేడు కర్నూలు జిల్లా ప్రతినిధి : కోడుమూరు అసెంబ్లీ నియోజకవర్గంలోని కర్నూలు మండల కాంగ్రెస్ అధ్యక్షురాలుగా బి హైమావతిని నియమించడమైనది. పిసిసి అధ్యక్షురాలు  వైఎస్ షర్మిల రెడ్డి  ఆదేశాల మేరకు కోడుమూరు అసెంబ్లీ నియోజకవర్గం కోఆర్డినేటర్ అనంతరత్నం మాదిగ  బొగ్గుల హైమావతిని కర్నూల్ మండల కాంగ్రెస్ అధ్యక్షురాలుగా నియమించడమైనది. హైమావతికి మాజీ ఎమ్మెల్సీ ఎం సుధాకర్ బాబు , సిటీ కాంగ్రెస్ అధ్యక్షులు షేక్ జిలాని భాష , అనంత రత్నం మాదిగ  నియామక పత్రం అందజేశారు. ఈ సందర్భంగా హైమావతి మాట్లాడుతూ ఎంతో నమ్మకంతో కాంగ్రెస్ పార్టీ నన్ను మండల కాంగ్రెస్ అధ్యక్షురాలుగా నియమించినందుకు అధిష్టానం పెద్దలందరికీ కృతజ్ఞతలు తెలియజేయుచున్నానని, చాలా గౌరవంగా ఉన్నదనీ కావున పార్టీ బలోపేతానికి అందర్నీ కలుపుకొని కృషి చేస్తానని తెలియజేశారు.ఈ కార్యక్రమంలో మాజీ ఎస్సీ సెల్ అధ్యక్షులు ఎండ్లూరి లాజరస్, మహిళా కాంగ్రెస్ ఏ లలితమ్మ, సి స్వప్న ఎస్ సలోమి, సి మాణిక్యమ్మ, రాజేశ్వరి, మల్లికా దివ్య తదితరులు పాల్గొన్నారు.

About Author