NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

మీ విధుల పట్ల సమయపాలన, అంకితభావం పాటించండి.. ఎమ్మెల్యే

1 min read

సిబ్బంది సమన్వయంతో సహకరించుకుంటూ పనులు త్వరగతిన పూర్తయ్యేలా చొరవ చూపాలి

ఏలూరుజిల్లా ప్రతినిధి,న్యూస్ నేడు: దెందులూరు మండల పరిషత్ కార్యాలయంలో జరిగిన సమావేశంలో ప్రభుత్వ సిబ్బందిని ఉద్దేశించి ప్రత్యేకంగా మాట్లాడుతూ పలు హితోక్తులు, సూచనలు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్చేశారు.ఈ సందర్భంగా దెందులూరు ఎమ్మెల్యే  చింతమనేని ప్రభాకర్  మాట్లాడుతూ  “మీ విధుల పట్ల సమయపాలన, అంకితభావం పాటించండి “ఈ ఊరు నాది_దీని అభివృద్ధి నా బాధ్యత” అనే నినాదంతో విధులు నిర్వహించండి – ప్రజల మన్ననలు అందుకోండి-విధి నిర్వహణలో దూరప్రాంతాలకు ప్రయాణించేటప్పుడు రోడ్లపై అప్రమత్తంగా ఉండండి – ప్రమాదాలకు గురి కాకుండా జాగ్రత్తలు వహించండి – మీ సహచర ఉద్యోగి మన బాపిరాజు గూడెం హార్టికల్చర్ అసిస్టెంట్ రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన ఘటన నన్ను కలచివేసింది – అందుకే దూరప్రాంతాలకు ప్రయాణించేటప్పుడు భద్రతా నియమాలు పాటించండి, క్షేమంగా ప్రయాణించండి,రాత్రి వేళలో పని త్వరగా ముగించుకోండి మీకు ఏదైనా కష్టం వచ్చినా సమస్య ఎదురైనా నా దృష్టికి తీసుకురండి పరిష్కరిస్తూ మీకు అండగా నిలుస్తాను పంచాయతీ, సచివాలయాల సిబ్బందికి దెందులూరు ఎమ్మెల్యే  చింతమనేని ప్రభాకర్  సూచనమీ సహచరుల పనిని పంచుకోండి – అభివృద్ధి లో భాగంకండిఅదేవిధంగా ఇటీవల జరుగుతున్న అభివృద్ధి పనుల రీత్యా ఇంజనీరింగ్ అసిస్టెంట్ ల పై కొంత పని భారం ఉంటున్న మాట వాస్తవమని, ఈ నేపథ్యంలో గ్రామాల్లో జరిగే అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల అమలు తీరుపై కేవలం ఒకరిద్దరు సిబ్బందిపై మాత్రమే భారం పడకుండా పనిని అక్కడి సచివాలయ సిబ్బంది అందరూ కూడా సమన్వయంతో సహకరించుకుంటూ పనులు త్వరితగతిన పూర్తయ్యేలా చొరవ చూపాలని ఈ అంశంలో సంబంధిత ఎంపీడీవోలు ఎప్పటికప్పుడు పర్యవేక్షించుకోవాలని దెందులూరు ఎమ్మెల్యే.ప్రభాకర్ సూచించారు.ఈ సమావేశంలో పలువురు ప్రజా ప్రతినిధులు, వివిధ శాఖల అధికారులు, కూటమి నాయకులు, పంచాయతీల ప్రత్యేక అధికారులు పంచాయతీ కార్యదర్శులు సచివాలయాల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *