NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

గ్రామాల్లో బెల్ట్ షాపుల దందా ఆపాలి – వెంటనే మూసివేయాలి

1 min read

గృహహింస పెరుగుతోంది

మహిళలు, పిల్లలు భయాందోళనలకు గురవుతున్నారు

కూలీల సంపాదన మొత్తం మద్యం దుకాణాలకే వెళ్లిపోతోంది

యువత భవిష్యత్తు చీకటిలోకి నెట్టబడుతోంది

ప్యాపిలి న్యూస్ నేడు:గ్రామాల్లో బెల్ట్ షాపుల దందా ఆపాలి – వెంటనే మూసివేయాలని సిపిఐ మండలకార్యదర్శి జె . మహేష్ అన్నారు.ప్యాపిలి పట్టణంలోని సిపిఐ కార్యాలయంలో పట్టణ కార్యదర్శి వెంకటేష్ అధ్యక్షతన మండలకార్యదర్శి జె మహేష్ గురువారం సమావేశం అయ్యారు.ఈ సందర్భంగా మహేష్ మాట్లాడుతూ గ్రామాల్లో అక్రమంగా నడుస్తున్న బెల్ట్ షాపులు పేద ప్రజల కుటుంబాలను ఆర్థిక, సామాజికంగా నాశనం చేస్తున్నాయి. ప్రభుత్వ అనుమతి లేకుండా, ఎక్సైజ్ చట్టాలను తుంచిపారేసి కొందరు దందా దారులు గ్రామాలను మద్యపు బానిసత్వంలోకి నెట్టేస్తున్నారు. ఇది కేవలం అక్రమ వ్యాపారం మాత్రమే కాదు – ప్రజల జీవితాలతో జరుగుతున్న క్రూర ఆట.ప్రభుత్వం మద్యం నియంత్రణపై మాటలు మాత్రమే చెబుతోంది గాని, గ్రామాల్లో బెల్ట్ షాపులు బహిరంగంగా నడవడం అధికారుల వైఫల్యానికి నిదర్శనం. సంబంధిత అధికారులు చూస్తూ చూడనట్లు వ్యవహరించడం అనుమానాలకు తావిస్తోందనిసిపిఐ డిమాండ్లు1. గ్రామాల్లో ఉన్న అన్ని అక్రమ బెల్ట్ షాపులను తక్షణమే మూసివేయాలి.2. అక్రమ మద్యం విక్రయదారులపై కఠిన క్రిమినల్ కేసులు నమోదు చేయాలి.3. నిర్లక్ష్యం చేసిన ఎక్సైజ్, పోలీస్ అధికారులపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలి.4. మహిళా సంఘాలు, గ్రామ కమిటీలతో కలిసి ప్రత్యేక డ్రైవ్ చేపట్టి శాశ్వత పరిష్కారం చూపాలి.ప్రజల కుటుంబాలను కాపాడడం ప్రభుత్వ రాజ్యాంగబద్ధ బాధ్యత. గ్రామాలను మద్యపు మత్తులో ముంచే బెల్ట్ షాపులపై వెంటనే చర్యలు తీసుకోకపోతే, CPI ఆధ్వర్యంలో గ్రామ స్థాయిలో పోరాటాలు, ఆందోళనలు నిర్వహిస్తామని హెచ్చరిస్తున్నాము. ఈ కార్యక్రమంలో పాల్గొన్న సిపిఐ నాయకులు చంద్రుడు,  రాము,నాగన్న,రమేష్ పాల్గొన్నారు.

About Author