ఘనంగా భీరలింగేశ్వర స్వామి దేవర పల్లకోత్సవం
1 min read

మంత్రాలయం న్యూస్ నేడు : మంత్రాలయం మండల పరిధిలోని చెట్నీహళ్లి గ్రామంలో వెలసిన శ్రీ భీరలింగేశ్వర స్వామి దేవరను రెండు రోజు ఆలయ పూజార్ల ఆధ్వర్యంలో ఘనంగా పల్లకోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా సోమవారం తెల్లవారుజామున చెట్నీహళ్లి గ్రామానికి చెందిన అళ్లింగప్ప, పెద్దకడుబూరు మండలం కల్లుకుంట గ్రామానికి చెందిన యాతగిరప్ప, ఎమ్మిగనూరు మండలం మసీదుపురం గ్రామానికి చెందిన వన్నికెరప్ప స్వామి వార్ల కలసి మూడు పల్లకి లు రాత్రి తుంగభద్ర నది తీరాన కోలవై ప్రత్యేక పూజలు నిర్వహించారు .తుంగభద్ర నది నుంచి పల్లకిలు పారువేట ఉత్సవాలు నిర్వహించి గ్రామ పూర వీధుల్లో గూండా డోలు, సన్నాయి, మేళ తాళాలు, నృత్యాలు, ఆట పాటలతో దేవాలయం వరకు పల్లకోత్సవం ఘనంగా నిర్వహించారు. అలాగే కుంభోత్సవం నిర్వహించి మొక్కలు తీర్చుకున్నారు. రాత్రి మలిగే పూజ అత్యంత వైభవంగా నిర్వహించారు. దేవర కు వచ్చిన భక్తులకు అన్నదానం కార్యక్రమం నిర్వహించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా సిఐ రామాంజులు ఆధ్వర్యంలో మంత్రాలయం ఎస్సై మల్లికార్జున తన పోలీసు సిబ్బంది హెడ్ కానిస్టేబుల్ రమణ, కానిస్టేబుల్ భాస్కర్ లు బందోబస్తు నిర్వహించారు.

