NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

“ మన ఊరు – మన జెండా” తో పందికోనలో బీజేపీ జెండా ఆవిష్కరణ

1 min read

న్యూస్ నేడు, పత్తికొండ:  పత్తికొండ మండలం పరిధిలోని పందికోన గ్రామంలో భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా “మన ఊరు – మన జెండా” కార్యక్రమం మంగళవారం ఘనంగా నిర్వహించారు. బిజెపి మండల అధ్యక్షులు కరణం నరేష్ అధ్యక్షతన   పందికోన గ్రామంలో “మన ఊరు – మన జెండా” కార్యక్రమంలో భాగంగా శివకుమార్, గోపాల్ పార్టీ జెండాను ఆవిష్కరించారు. కార్యక్రమానికి పార్టీ కార్యకర్తలు, గ్రామ ప్రజలు హాజరై ఉత్సాహంగా పాల్గొన్నారు.ఈ కార్యక్రమంలో భాగంగానే పత్తికొండ అసెంబ్లీ కన్వీనర్ గోవర్ధన్ నాయుడు హాజరై మాట్లాడుతూ, భారతీయ జనతా పార్టీ ప్రతి గ్రామంలో పార్టీ జెండాను ఎగరేయాలని రాష్ట్ర అధ్యక్షుడు పీవీన్ మాధవ్  ఇచ్చిన పిలుపు మేరకు ఈ “మన ఊరు – మన జెండా” కార్యక్రమం నిర్వహిస్తున్నామని తెలిపారు. గ్రామ స్థాయిలో పార్టీని బలోపేతం చేయడం ప్రతి కార్యకర్త బాధ్యత అని పేర్కొన్నారు.అలాగే కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల ద్వారా ప్రతి గ్రామ పంచాయతీకి అభివృద్ధి కోసం భారీగా నిధులు అందుతున్నాయని తెలిపారు. ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశం అభివృద్ధి దిశగా వేగంగా ముందుకు సాగుతోందని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో .మన ఊరు – మన జెండా కార్యక్రమం ద్వారా గ్రామాల్లో జాతీయ భావనను మరింత బలోపేతం చేయడమే లక్ష్యమని నాయకులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో స్టేట్ కౌన్సిలింగ్ మెంబర్ పూనా మల్లికార్జున కిసాన్ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు దండి మల్లికార్జున అధికార ప్రతినిధి బ్రహ్మయ్య ఓ బి సి మోర్చా జిల్లా కార్యదర్శి రామాంజనేయులు. జిల్లా కార్యవర్గ సభ్యులు తంబల నాగేష్. లీగల్ సెల్ కన్వీనర్ అడ్వకేట్ భాస్కర్. మండల ప్రధాన కార్యదర్శి మాలేకరు వీరేష్. సీనియర్ నాయకులు గోరంట్ల. మాజీ మండల అధ్యక్షుడు తదితరులు పాల్గొన్నారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *