పశువుల మేత కోసం వేసిన గడ్డివాములు దగ్ధం.. రైతులకు 3 లక్షలు నష్టం
1 min read

పత్తికొండ, న్యూస్ నేడు : పత్తికొండ మండలం జయ అగ్రహారం గ్రామంలో మంగళవారం ఉదయం పది గంటల సమయంలో ప్రమాదవశాత్తు విద్యుత్ వైర్లు తగిలి రెండు గడ్డివాములు దగ్ధ మయ్యాయి. అధికంగా గాలివీయడంతో పక్కన ఉన్న విద్యుత్తు వైర్లు తగిలి షార్ట్ సర్క్యూట్ తో పశువుల మేత కోసం వేసిన గడ్డివాములు పూర్తిగా కాలి బూడిదయ్యాయి. గ్రామస్తులు గడ్డివాములకు వ్యాపించిన మంటలను అదుపు చేయడానికి ప్రయత్నించారు. గడ్డివాములు అంటుకున్న సమాచారం తెలుసుకున్న అగ్నిమాపక దళ సిబ్బంది హుటాహుటిన గ్రామానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. పక్కన ఉన్న గడ్డివాములకు మంటలు వ్యాపించకుండా అగ్నిమాపక సిబ్బంది తీవ్రంగా శ్రమించారు. పశువుల మేత కోసం వేసిన గడ్డివాములు కాలి బూడిద కావడంతో రైతులు 3 లక్షల దాకా నష్టం వాటిల్లిందని గ్రామానికి చెందిన లక్ష్మన్న, రామచంద్ర ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం తమకు జరిగిన నష్టపరిహారం చెల్లించి, ఆదుకోవాలని రైతులు కోరారు.


