ఇన్సూరెన్స్ తో బాదిత కుటుంబానికి కెనరా బ్యాంక్ అండ..
1 min read
గోనెగండ్ల, న్యూస్ నేడు: నా పేరు చాకలి మల్లీశ్వరి. మాది చిన్న మర్రివీడు గ్రామము, గోనెగండ్ల మండలం, కర్నూలు జిల్లా. నా భర్త పేరు చాకలి ప్రభాకర్. నా భర్త అనారోగ్యంతో మరణించడం జరిగింది. ఈ విషయాన్ని ఆర్థిక అక్షరాస్యత కేంద్రం కౌన్సిలర్లు మా గ్రామంలో మీటింగ్ ఏర్పాటు చేసినప్పుడు నేను వారికి తెలియజేయడం జరిగింది. వారు PMJJBY కింద 436 రూపాయల ఇన్సూరెన్స్ ఉందని తెలిపి అప్లై చేపించడం జరిగింది. నామిని అయినా నాకు రెండు లక్షల రూపాయల చెక్కురావడం జరిగింది. ఈ చెక్కును బ్యాంక్ ఆఫీస్ నందు ఆర్థిక అక్షరాస్యత కేంద్రం వారు సమావేశం ఏర్పాటు చేసి, రెండు లక్షల రూపాయల చెక్కును కెనరా బ్యాంక్ అసిస్టెంట్ మేనేజర్ రేవంత్ అందించడమైనది. ఈ ఆర్థిక సహాయం అందించిన మేనేజర్ కి, అసిస్టెంట్ మేనేజర్ కి మరియు ఈ సహాయం పొందడానికి సహకరించిన ఎస్. ఎస్. టి.సంస్థ పెద్దలు ఆంజనేయులు కి, అశోక్ కుమార్ సార్ కి, కౌన్సిలర్లు బి. రామాంజనేయులు, టి. నరసింహ, మద్దిలేటి కు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము.

