త్రాగునీటి పైపులైన్ పనులు త్వరగా పూర్తి చేయండి..
1 min read
పనులను పరిశీలించిన ఎమ్మెల్యే మరియు మాండ్ర..
నందికొట్కూరు, న్యూస్ నేడు: త్రాగునీటి పైపులైన్ పనులనుత్వరగా పూర్తి చేయాలని నందికొట్కూరు ఎమ్మెల్యే గిత్త జయసూర్య అధికారులను ఆదేశించారు.నంద్యాల జిల్లా నందికొట్కూరు మండల పరిధిలోని అల్లూరు గ్రామంలో 81 లక్షలతో జరుగుతున్న పైపులైన్ పనులను మంగళవారం సాయంత్రం ఎమ్మెల్యే మరియు నంద్యాల పార్లమెంట్ టీడీపీ ఇన్చార్జి మాండ్ర శివానందరెడ్డి పరిశీలించారు.కూటమి ప్రభుత్వం చేపడుతున్న ప్రతి ఇంటికీ తాగు నీటి సరఫరా సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తున్నామని వారు అన్నారు. గ్రామంలో నీటి సమస్య తలెత్తకుండా అదేవిధంగా గ్రామ ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా నాణ్యతగా పనులు చేపట్టాలని ఎమ్మెల్యే ఆర్డబ్ల్యూఎస్ అధికారులకు సూచించారు.ఈ కార్యక్రమంలో ఆర్డబ్ల్యూఎస్ డీ ఈఈ శ్రీనివాసులు,ఏఈ వేణు మాధురి,టీడీపీ నాయకులు కురువ వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.

