NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

కడప మహానాడు వేదికలో చంద్రబాబుతో శ్రీ.బి.వీరభద్ర గౌడ్ 

1 min read

న్యూస్ నేడు ఆలూరు: ఆలూరు తాలూకా తెలుగుదేశం పార్టీ ఇంచార్జి తాలూకా ప్రజాభిమాన నాయకులు శ్రీ.బి.వీరభద్ర గౌడ్  ఈరోజు కడప మహానాడు వేదికలో ముఖ్యమంత్రి వర్యులు శ్రీనారా చంద్రబాబు నాయుడు తో కలసి ఆలూరు నియోజకవర్గ ప్రజల సమస్యలను వారికి తెలియజేసి అలాగే ఆలూరు తాలూకా ప్రజల చిరకాల స్వప్నం వేదావతి మరియు నగరడోన రిజర్వాయర్ల నిర్మాణమునకు తగిగిన నిధులు కేటాయించి ఆలూరు నియోజకవర్గ రైతులను కాపాడాలని వారికి విన్నవించటం జరిగింది.అలాగే ఈకార్యక్రమానికి ఆలూరు తాలూకా టిడిపి యువనేత గౌ.గిరిమల్లేశ్ గౌడ్ ఆధ్వర్యంలో నియోజకవర్గ ఆరుమండలాల నుండి దాదాపు 150 కార్లు మరియు 40 బస్సులలో 5000వేలమంది తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు సర్పంచ్ లు, ఎపిటిసిలు  ,జెడ్పిటిసి లు, ఎంపీపీ లు, మరియు వివిధ హోదాలలో ఉన్న రాష్ట్ర,జిల్లా మరియు తాలూకా స్థాయి వివిధ హోదాలలో ఉన్న ప్రజా ప్రతినిధులు అలాగే తెలుగు యువత,ఐటిడిపి, టియన్​ఎస్​ఎఫ్​,    , టియన్​టియుసి టిడిపి శోషల్ మీడియా మరియు మహిళా సంఘాలు, టిడిపి అనుబంధ సంఘాల పసుపు సైనికులు,కార్యకర్తలు అందరూ భారీఎత్తున పాల్గొన్నారు.

About Author