సీఎం జగన్ పై కేసు వేసిన చింతమనేని !
1 min read

పల్లెవెలుగువెబ్ : ఏలూరు కోర్టులో మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ప్రైవేటు కేసు దాఖలు చేశారు. అక్రమ కేసుల బనాయిస్తున్నారని ప్రభుత్వంపై పిటిషన్ వేశారు. సీఎం జగన్, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, మాజీ డీజీపీ గౌతమ్‌సవాంగ్, రాహుల్ దేవ్‌శర్మ, కృష్ణారావు, నలుగురు సీఐలు, ముగ్గురు ఎస్ఐలపై చింతమనేని ప్రైవేటు కేసు వేశారు. ఆందోళనలు, టీడీపీ కార్యక్రమాల్లో పాల్గొంటే కేసులు పెట్టి వేధిస్తున్నారని, రెండేళ్లలో తనపై 25 కేసులకుపైగా నమోదు చేశారని చింతమనేని ప్రభాకర్ తెలిపారు.

