ఇట్రెడ్డి రామ్మోహన్ రెడ్డి ఎంపిక పట్ల హర్షం
1 min read

ఎస్ టి యు పత్తికొండ మండల శాఖ
పత్తికొండ , న్యూస్ నేడు: ఎస్టియు రాష్ట్ర కార్యదర్శిగా ఇట్రెడ్డి రామ్మోహన్ రెడ్డి ఎంపిక పట్ల ఎస్ టి యు జిల్లా ఉపాధ్యక్షుడు వామనగిరి చంద్రశేఖర్, మండల శాఖ అధ్యక్ష, కార్యదర్శులు మారుతి, ఆవుల నాగరాజు , ఆర్థిక కార్యదర్శి మండ్ల వెంకటేశ్వర్లు , ఎస్టియు సీనియర్ నాయకులు బి వీరస్వామి, కుంపటి నారాయణ, కొత్తపల్లి సత్యనారాయణ ,బలరాముడు, చెన్నకేశవరావు, ఇక్బాల్ హుస్సేన్ , చంద్రశేఖర రెడ్డి, గౌస్, ఉల్తెన్న, హర్షం వ్యక్తం చేశారు . కడపలో ఈనెల14న జరిగిన రాష్ట్ర కార్యవర్గంలో జిల్లాలో గత ఆరు ఏళ్లుగా ఆర్థిక కార్యదర్శిగా పనిచేస్తూ, ఉపాధ్యాయులకు నిరంతరం అందుబాటులో ఉంటూ, ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం కోసం కృషిచేసిన, చేస్తున్న ఇట్రెడ్డి రామ్మోహన్ రెడ్డి ని ఎస్టీయూ రాష్ట్ర కార్యదర్శిగా ఏకగ్రీవంగా ఎన్నుకోవడం పట్ల పత్తికొండ మండల ఉపాధ్యాయులు హర్షం వ్యక్తం చేశారు .ఈ సందర్భంగా రాష్ట్ర కార్యదర్శిగా ఎంపికైన రామ్ మోహన్ రెడ్డి మాట్లాడుతూ, రాష్ట్ర ఉపాధ్యాయ సంఘం నిరంతరము ఉపాధ్యాయులకు అందుబాటులో ఉంటూ, సమస్యలపరిష్కారానికి కృషి చేస్తూ ,ఉపాధ్యాయుల సంక్షేమమే ఎస్టియు ధ్యేయంగా పనిచేస్తుందన్నారు. రాబోయే రోజుల్లో విద్యా ఉపాధ్యాయ రంగ సమస్యల పరిష్కారానికై, పిఆర్సి చైర్మన్ నియామకానికై, 30% మద్యంతర భృతి కొరకై,పెండింగ్ డిఎ విడుదలకై ,పిఆర్సి బకాయిలకై, సిపిఎస్ రద్దుకై ,2003 డీఎస్సీ ఉపాధ్యాయులకు పాత పెన్షన్ విధానం అమలుకై, ఉపాధ్యాయులను బోధనకే పరిమితం చేయాలని, బోధనేతర పనుల నుండి మినహాయింపు కోసం ఉద్యమ బాట పట్టబోతున్నామని తెలిపారు. ప్రభుత్వ విద్యారంగ పరిరక్షణకై ఎస్టియు నిరంతరం కృషి చేస్తుందని ఆయన స్పష్టం చేశారు.
ఉపాధ్యాయులు, ఉద్యమ బాట, ఎస్టియు,

