ఆర్యవైశ్యులకు అండగా కూటమి ప్రభుత్వం
1 min read

ప్రకాశం జిల్లా పొదిలిలో వ్యాపారి అవినాష్‌తో ఎస్సై అనుచిత ప్రవర్తన బాధాకరం
బాదితుడు అవినాష్‌ను ఫోన్లో పరామర్శించిన రాష్ట్ర మంత్రి టీజీ భరత్
ఎలాంటి కష్టమొచ్చినా తనను సంప్రదించాలని అవినాష్‌కు ధైర్యం చెప్పిన మంత్రి టీజీ
కర్నూలు, న్యూస్ నేడు: ఆర్యవైశ్యులకు ప్రభుత్వం అన్నివిధాలా అండగా ఉంటుందని రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి టీజీ భరత్ అన్నారు. ప్రకాశం జిల్లా పొదిలిలో ఆర్యవైశ్యుడు యాదాల అవినాష్‌ను స్థానిక ఎస్సై కొట్టిన నేపథ్యంలో మంత్రి టీజీ భరత్ ..అవినాష్ తో ఫోన్లో మాట్లాడి పరామర్శించారు. ఘటనకు సంబంధించిన వివరాలు తెలుసుకొని ధైర్యం చెప్పారు. ఎస్సైపై ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటుందన్నారు. ఎలాంటి కష్టమొచ్చినా వెంటనే తనను సంప్రదించాలని బాదితుడు అవినాష్‌కు మంత్రి టీజీ చెప్పారు. ఇలాంటి సంఘటన జరగడం ఎంతో బాధాకరమని మంత్రి టీజీ ఆవేదన వ్యక్తం చేశారు. తమ ప్రభుత్వం ఇలాంటి వాటిని సహించదన్నారు. ఆర్యవైశ్యులకు ఇబ్బందులు లేకుండా తమ ప్రభుత్వం చూసుకుంటుందన్నారు. వ్యాపారులకు ప్రభుత్వం ఎల్లవేళలా అండగా ఉంటుందన్నారు. ఆర్యవైశ్యులకు కూటమి ప్రభుత్వం ఎంతో ప్రాధాన్యత ఇస్తోందని తెలిపారు. తమ ప్రభుత్వం పెనుగొండను వాసవి పెనుగొండగా పేరు మార్చినట్లు మంత్రి టీజీ భరత్ గుర్తు చేశారు.

