శనగ ..మొక్కజొన్న , మల్లె, కూరగాయలు పంటలను పరిశీలించిన కలెక్టర్
1 min read

కల్లూరు, న్యూస్ నేడు: కల్లూరు మండలం లోని బస్తిపాడు, గ్రామంలో శనగ మొక్కజొన్న , మల్లె,మరియు కూరగాయలు పంటలను కలెక్టర్ డా. ఎ.సిరి ఐఏఎస్ పరిశీలించడం జరిగింది. శనగ పంట సాగు, ప్రస్తుత ఉన్న పంటల మద్దతు ధరల గురించి బస్తిపాడు గ్రామ రైతులను అడిగి తెలుసుకున్నారు. ప్రకృతి వ్యవసాయ పద్ధతులు పాటిస్తూ వివిధ పంటల్లో తక్కువ పెట్టుబడితో ఎక్కువ దిగుబడి సాధించాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి శ్రీమతి పి. ఎల్.వరలక్ష్మీ , ఆర్డీఓ ,మండల వ్యవసాయ అధికారి విష్ణు వర్ధన్ రెడ్డి కల్లూరు వారు, మండల తహశీల్దార్ ,మండల ఉద్యానవన అధికారి, గ్రామ సర్పంచ్ , ఎ.ఈ. ఓ, ప్రకృతి వ్యవసాయ సిబ్బంది, గ్రామ రైతులు పాల్గొనడం జరిగినది.

