NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

సూర్య నారాయణ స్వామి దేవాలయంలో సంపూర్ణ భగవద్గీతా పారాయణం

1 min read

కర్నూలు, న్యూస్​ నేడు:  శ్రీ శ్రీ శ్రీ గణపతిసచ్చిదానంద స్వామీజీ మరియు శ్రీ శ్రీ దత్తవిజయానంద తీర్థ స్వామీజీ వారి దివ్య ఆదేశానుసారం, కోటి భగవద్గీతా పారాయణంలో భాగంగా, మన కర్నూలు సూర్య నారాయణ స్వామి దేవాలయంలో సంపూర్ణ భగవద్గీతా పారాయణం జరిగినది. ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఆలయ ట్రస్ట్ సభ్యులు మరియు మాతృమండలి సభ్యులు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసారు. అనంతరము భక్తులకు అన్నప్రసాద వితరణ ఏర్పాటు చేయడం జరిగినది. ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొనీ , శ్రీ సద్గురు కృపకు, మరియు శ్రీ కృష్ణ పరమాత్మ కృపకు పాత్రులుఅయ్యారు.

About Author