పత్తి కొనుగోలు సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాం
1 min read
జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ. సిరి
కర్నూలు, న్యూస్ నేడు : పత్తి కొనుగోలు సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాం అని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ. సిరి పేర్కొన్నారు.ఎమ్మిగనూరు పరిధిలో నగర శివార్లలో ఉన్న పత్తి కొనుగోలు కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా పత్తి రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను కలెక్టర్ కు వివరించారు. కలెక్టర్ స్పందించి స్లాట్ బుకింగ్ లో వస్తున్న సాంకేతిక సమస్యలు, తేమ శాతం వంటి రైతుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని తెలిపారు.పత్తి తేమశాతం (మాయిశ్చరైజేషన్) 20 శాతం వరకు సీసీఐ కొనుగోలు చేయాలని ఇప్పటికే లేఖ రాశాం. ప్రస్తుతం 12% వరకు మాత్రమే కొనుగోలు చేస్తున్నారు. 13% నుండి 14% తేమ ఉన్న పత్తిని సీసీఐ కొనుగోలు చేయాలని సూచించాం అని జిల్లా కలెక్టర్ పేర్కొన్నారు.


