సేంద్రియ పద్దతిలో పండించిన కూరగాయలు వినియోగం
1 min read

సేంద్రియ పద్దతిలో కూరగాయల సాగు వేగవంతం చేయాలి
విద్యార్థుల ఆరోగ్య పరిరక్షణకు ప్రాధాన్యం
పెదపాడు మండలంలోని పలు సంక్షేమ వసతి గృహాలను ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ కె.వెట్రిసెల్వి
ఏలూరు జిల్లా ప్రతినిధి,ఏలూరు జిల్లా ప్రతినిధి: జిల్లాలోని ప్రభుత్వ సంక్షేమ వసతి గృహాలలో సేంద్రియ పద్దతిలో కూరగాయల సాగు పనులు వేగవంతం చేయాలనీ జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి అధికారులను ఆదేశించారు. పెదపాడు మండలం వట్లూరు లోని వెనుకబడిన తరగతుల బాలికల వసతి గృహం మరియు బాలుర వసతి గృహం, వట్లూరులోని పిఎం శ్రీ డా.బి.ఆర్.అంబేద్కర్ బాలికల గురుకుల పాఠశాలను కలెక్టర్ శనివారం ఆకస్మికంగా తనిఖీ చేసి, వసతి గృహాల పరిసరాలు, వంట తయారీ ప్రాంతంలో పరిశుభ్రత, ఆహార తయారీ సరుకుల నాణ్యతలను అధికారులతో కలిసి కలెక్టర్ పరిశీలించారు. నంతరం వట్లూరు గురుకుల పాఠశాలలో అధికారులతో కలెక్టర్ సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ వెట్రిసెల్వి మాట్లాడుతూ జిల్లాలో సంక్షేమ వసతి గృహాలలో విద్యార్థుల ఆరోగ్య పరిరక్షణకు రసాయనాలు లేని సేంద్రియ విధానంలో పండించిన కూరగాయలు అందించాలన్నది ప్రభుత్వ లక్ష్యమన్నారు. అందుకు అనుగుణంగా జిల్లాలోని అన్ని ప్రభుత్వ సంక్షేమ వసతి గృహాలలో అందుబాటులో ఉన్న స్థలంలో ప్రకృతి సాగు విధానంలో కూరగాయలు పండించేందుకు అనువైన ప్రదేశాన్ని గుర్తించి, కూరగాయలు మొక్కలు పెంపకంనకు అనువుగా తీర్చిదిద్దాలన్నారు. అనంతరం వసతి గృహాలలో విద్యార్థిని, విద్యార్థులను కలిసి వారి సమస్యలను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. వసతి గృహంలో ఆహరం నాణ్యత, మెనూ ప్రకారమే ఆహరం అందిస్తున్నారా , లేదా అని కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా గురుకులం ఆవరణలో జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి మొక్కను నాటారు.


