పదవ తరగతి బోధిస్తున్న సబ్జెక్టు నిపుణులతో కోఆర్డినేషన్ సమావేశం
1 min read

కర్నూలు , న్యూస్ నేడు: కర్నూలు జిల్లాలోని వి లర్నింగ్ డిజిటల్ స్టూడియో లో పదవ తరగతి ఉత్తీర్ణతా శాతం పెంచుటకు తీసుకునే చర్యలలో భాగంగా, డివిజన్ స్థాయిలో జరుపబోవు ఒకరోజు శిక్షణ కార్యక్రమం కు సంబంధించి , టెన్త్ క్లాస్ సబ్జెక్టు బోధిస్తున్నటువంటి సబ్జెక్ట్ నిపుణులతో కోఆర్డినేషన్ సమావేశం ఏర్పాటు చేయడమైనది. ఈ కోఆర్డినేషన్ మీటింగ్ లో ప్రతి సబ్జెక్టుకు 12 మంది చొప్పున మొత్తం 84 మంది సబ్జెక్టు నిపుణులు హాజరై ఒకరోజు శిక్షణలో ఇవ్వవలసిన అంశాలు చర్చించడం జరిగినది. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి ఎస్ శామ్యూల్ పాల్ మాట్లాడుతూ పరాక్ PARAKH సర్వేలో కానీ, పదవ తరగతి ఉత్తీర్ణతలో కాని కర్నూలు జిల్లా చివరి స్థానంలో ఉండటానికి టీచర్ల కొరత చాలా ఉండేదని, ఈ విద్యా సంవత్సరంలో మెగా డీఎస్సీ ద్వారా మరియు ప్రమోషన్స్ ద్వారా చాలావరకు ఉపాధ్యాయుల కొరత తీరిందని, పశ్చిమ ప్రాంతం మండలాల్లోని విద్యార్థులు వలసలు వెళ్లే పరిస్థితులు ఉన్నాయి అని, వీటన్నిటినీ అధిగమించి కమిషన్ ఇచ్చిన 100 రోజుల యాక్షన్ ప్లాన్ అమలు చేసి విద్యార్థుల ఉత్తీర్ణతస్థాయిని పెంచడానికి ఉపాధ్యాయులను వారి ద్వారా తల్లిదండ్రులను విద్యార్థులను సంసిద్ధులను చేయాలని సబ్జెక్ట్ నిపుణులను కార్యోన్ముఖులను చేయడమైనది. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ కమిషనర్ ఫర్ గవర్నమెంట్ ఎగ్జామ్స్ శ్రీ గోవింద నాయక్ పాల్గొన్నారు. ఈ కోఆర్డినేషన్ మీటింగ్ ను డిసిఈబి సెక్రటరీ శ్రీ బి నాగరాజు మరియు సీనియర్ ప్రధానోపాధ్యాయులు శ్రీ టి మధుసూదన్ శర్మగారు సమన్వయం చేయడమైనది.

