సర్వీసులో ఉన్న ఉపాధ్యాయులను టెట్ పరీక్ష నుండి మినహాయించాలి
1 min read

ఒంగోలు, న్యూస్ నేడు : సర్వీసులో ఉన్న ఉపాధ్యాయులను టెట్ పరీక్ష నుండి మినహాయించాలని కోరుతూ దేశవ్యాప్తంగా అందరూ పార్లమెంటు సభ్యులకు వినతిపత్రం సమర్పించాలని అఖిల భారతీయ సైక్సిక్ మరియు ఆంధ్ర ప్రదేశ్ ఉపాధ్యాయ సంఘంపిలుపు మేరకు నేడు ఒంగోలులో ఈ విషయాన్ని పార్లమెంటులో ప్రస్తావించి విద్యా హక్కు చట్టాన్ని సవరించాలని బిల్లు కోరుతూ ఒంగోలు పార్లమెంటు సభ్యులు శ్రీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి కి వినతిపత్రం సమర్పించినట్లు ఆపస్ రాష్ట్ర సంఘటన కార్యదర్శి సిహెచ్ శ్రావణ్ కుమార్ తెలిపారు. ప్రమోషన్ కొరకు ప్రతి ఉపాధ్యాయుడు టెట్ రాయాలనడం సమంజసం కాదని ఈ విషయమై రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకోవాలని కోరారు . ఈ విషయమై కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువెళతామని ఒంగోలు పార్లమెంటు సభ్యులు శ్రీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షురాలు సి.హెచ్ . హిమజ , జిల్లా అధ్యక్షులు కె.మల్లికార్జునరావు, ఉపాధ్యక్షులు ఎస్.నాగ ప్రకాష్, కార్యాలయ కార్యదర్శి కె.నరసింహం,ఒంగోలు మండల బాధ్యులు జి. ఆనంద్ తదితరులు పాల్గొన్నారు.

