NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

స్మార్ట్ మీటర్ల ను రద్దుచేయాలని విద్యుత్ సబ్ స్టేషన్ ముందు సిపిఎం ధర్నా

1 min read

పత్తికొండ, న్యూస్​ నేడు:  ప్రజలపై భారాలను మోపేస్మార్ట్ మీటర్లను రద్దు చేయాలని విద్యుత్ సర్దుబాటు చార్జీల పేరుతో పెంచిన విద్యుత్ ఛార్జీలను తగ్గించాలని సిపిఎం మండల కమిటీ సభ్యులు ముక్కెళ్ల  అశోక్ డిమాండ్ చేశారు. సిపిఎం పార్టీ జిల్లా కమిటీ పిలుపుమేరకు సోమవారం  నాడు స్థానిక విద్యుత్ సబ్ స్టేషన్ ముందు సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు… ఆ పార్టీ నాయకులు పెద్ద రాయుడు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ముక్కెళ్ల అశోక్  మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాకముందు విద్యుత్ చార్జీలు పెంచబోమని స్మార్ట్ మీటర్ల ను రద్దు చేస్తామని చెప్పి  అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యుత్ సర్దుబాటు చార్జీల పేరుతో 15 వేల కోట్ల రూపాయలు ప్రజల పైన భారాలు వేసిందనీ విమర్శించారు, ఆనాడు తెలుగుదేశం పార్టీ అగ్ర నాయకులు స్మార్ట్ మీటర్లను  పగలగొట్టండని పిలుపునిచ్చి స్మార్ట్ మీటర్ల పేరుతో ఇప్పుడూ  ప్రజల పైన భారాల మోపడానికి స్మార్ట్ మీటర్ల వ్యవస్థను తీసుకొస్తుందని గత ప్రభుత్వంలో విద్యుత్ సర్దుబాటు చార్జీలను వ్యతిరేకించిన కూటమి ప్రభుత్వము తాను అధికారంలోకి వచ్చిన గత ప్రభుత్వం అనుసరించిన విధానాల్ని అనుసరిస్తుందని గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి ఎటువంటి తేడా లేదని ఆయన విమర్శించారు ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి స్మార్ట్ మీటర్లు బిగించకుండా పెంచినవిద్యుత్  సర్దుబాటు చార్జీలను తగ్గించాలని ఆయన కూటమి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. లేని పక్షంలో రానున్న కాలంలో ప్రజలను సమీకరించి పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహిస్తామని ఆయన హెచ్చరించారు అనంతరం డిమాండ్స్ తో కూడిన వినతి పత్రాన్ని మండల విద్యుత్ అధికారి కి  అందజేయడం జరిగింది.

About Author