బాబు షూరిటి మోసం గ్యారంటీ కార్యక్రమం…
1 min read

హొళగుంద న్యూస్ నేడు: ఆలూరు నియోజకవర్గం హోళగుంద మండల కేంద్రం నందు ఎస్ఆర్ ఫంక్షన్ హాల్ లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రివర్యులు వైస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు బాబు షూరిటి మోసం గ్యారంటీ కార్యక్రమాన్ని ఆలూరు ఎమ్మెల్యే బుసినే విరుపాక్షి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించరు.ఆలూరు ఎమ్మెల్యే బుసినే విరుపాక్షి మాట్లాడుతూ..మాట్లాడుతూ ప్రతి ఒక్క నాయకుడు, కార్యకర్తలు అందరూ కలిసి ప్రతి ఇంటికి వెళ్లి చంద్రబాబు షూరిటీ మోసం గ్యారంటీ క్యూఆర్ కోడ్ ను స్కాన్ చేసి చంద్రబాబు నాయుడు మీకు ఎంత అప్పు ఉన్నారో చూడవచ్చు అన్నారు, చంద్రబాబు నాయుడు ప్రజలకు దొంగ హామీలు ఇచ్చి నెరవేర్చలేదన్నారు, మన జగనన్న ప్రతి ఒక్క నాయకుని కార్యకర్తని రాబోయే రోజుల్లో గుండెల్లో పెట్టుకొని చూసుకుంటారన్నారు. వైస్సార్సీపీ పార్టీ కి బలమైన మండల హొళగుంద అని అన్నారు.నాకు వైస్సార్సీపీ పార్టీ ఇంచార్జ్ ఇచ్చినపుడు జగన్ అన్న ను నేను అడిగిన వెంటనే హొళగుంద టూ మార్లమాడికి గ్రామానికి రోడ్డు ను వేసిన ఘనత వైస్సార్సీపీ పార్టీది. తల్లికి వందనం పథకం కేవలం 30 లక్షల లబ్ధిదారులకు మాత్రమే ఇచ్చారు, కాని చంద్రబాబు నాయుడు మాత్రం 50 లక్షల మందికి ఇచ్చాము అని అబద్దాల మాటలు చెపుతున్నారు.మా నాయకుడు వైస్ జగన్ మోహన్ రెడ్డి కుల మతల అతితంగా వాలంటీర్స్ ద్వారా సంక్షేమ పథకలు అందించిన ఘనత వైస్ జగన్ మోహన్ రెడ్డి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు రాష్ట్రంలో ఎక్కడ కనిపించడం లేదు, ఆయన కేవలం సినిమాలు తీయడంలో బిజీ అయ్యారు తప్ప, ప్రజలకు మంచి పాలన అందించాలని లేదు అని అన్నారు.కూటమి ప్రభుత్వం వచ్చి 13 నెలలు అవుతున్న రైతులకు అన్నదాత సుఖీభవ పథకం ఇవ్వడం లేదు. వైసీపీ ప్రభుత్వం ఉన్నపుడు రైతులకు రైతు భరోసా, పంటల భీమా పథకని అమలు చేసిన ఘనత మా నాయకుడు వైస్ జగన్మోహన్ రెడ్డి .కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే ఇసుక ప్రి అని ఇప్పుడు కూటమి నాయకులు ఇసుక ను ఇష్టనూసారంగా అమ్ముకుంటున్నారు.2029 లో ఆలూరు నుంచి వైస్సార్సీపీ పార్టీ ఎమ్మెల్యే గా ఫస్ట్ గిఫ్ట్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఇవ్వాలని అన్నారు.ఈ కార్యక్రమం రాష్ట్ర కార్యదర్శి తెర్నేకల్ సురేంద్ర రెడ్డి లో వైస్సార్సీపీ మండల కన్వీనర్, జడ్పీటీసీ, ఎంపీపీ, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, జిల్లా కార్యవర్గ సభ్యులు,తాలూకా కార్యవర్గ సభ్యులు, మండల కార్యవర్గ సభ్యులు, సర్పంచ్ లు, ఎంపీటీసీ లు, కో కన్వీనర్, వైస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు, బివిఆర్ అభిమానులు పాల్గొన్నారు.


