NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

రైతులకు సులభంగా పంట రుణాలు అందించాలి

1 min read

జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ.సిరి

కర్నూలు,  న్యూస్​ నేడు : సహకార బ్యాంకుల ద్వారా రైతులకు సులభంగా పంట రుణాలు అందించాలని  జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ.సిరి బ్యాంకు అధికారులను ఆదేశించారు.గురువారంకలెక్టర్ కార్యాలయంలో కెడిసిసి బ్యాంక్ కు సంబంధించి జిల్లా స్థాయి అమలు, పర్యవేక్షణ కమిటీ సమావేశాన్ని  జిల్లా కలెక్టర్  అధ్యక్షతన నిర్వహించారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ… స్వయం సహాయక మహిళ బృందాలకు 9 శాతం వడ్డీ రేటు తో రుణాలు  అందించాలని, అలాగే  రైతులకు పంట రుణాలు పారదర్శకంగా, సులభంగా  అందేలాగా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. జిల్లాలోని 43 ప్రైమరీ అగ్రికల్చర్ క్రెడిట్ సొసైటీలు పూర్తిస్థాయిలో కంప్యూటరీకరణ గురించి అడిగి తెలుసుకున్నారు.  వినియోగదారులకు కెడిసిసి బ్యాంకు ద్వారా కస్టమర్లకు మంచి సేవలను అందించాలని కలెక్టర్ సూచించారు. ఈ సందర్భంగా సీఈవో రామాంజనేయులు మాట్లాడుతూ…జిల్లాలోని 43 ప్రైమరీ అగ్రికల్చర్ క్రెడిట్ సొసైటీలు ఆత్మ నిర్భర్ భారత్ లో భాగంగా పూర్తిగా కంప్యూటరైజేషన్ జరగటం వలన ఇతర జాతీయ బ్యాంకుల లాగే సమర్థవంతంగా నిబంధనల మేరకు  పనిచేస్తున్నాయని , ఇక్కడ  మాత్రమే తక్కువ వడ్డీ రేటు తో ఎక్కువ మొత్తాలకు రుణాలు మంజూరు చేస్తున్నామని అలాగే పంట రుణాలు కూడా ఇస్తున్నామని తెలిపారు. స్వయం సహాయక మహిళలకు 20 లక్షల దాకా రుణాలు మంజూరు చేస్తున్నామని , పండ్ల తోటలకు రెండు లక్షల రూపాయలు , బంగారు ఆభరణాలపై కూడా రుణాలు ఇస్తున్నామని తెలియజేశారు. ఇతర బ్యాంకులో లాగా సర్వీస్ చార్జీలు , ఇతర ప్రాసెసింగ్ చార్జీలు ఇక్కడ తీసుకోవడం జరగదని తెలిపారు. ఈ సమావేశానికి డి సి సి బి  సీఈవో రామాంజనేయులు , నాబార్డ్ మేనేజర్ సుబ్బారెడ్డి , జిల్లా సహకార అధికారి వెంకటకృష్ణ , చీఫ్ మేనేజర్ అపర్ణ , ఆప్కాబ్ మేనేజర్ రంగనాథ్ , ప్యాక్స్ సీఈవోలు దేవకుమార్ , హరినాథ్ రెడ్డి , ఆరిఫ్ భాష లు పాల్గొన్నారు.

About Author