NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

రోగి ప్రాణ రక్షణనే  వైద్య వృత్తి యొక్క ప్రధాన ధర్మం…

1 min read

కర్నూలు, న్యూస్​ నేడు:  అడిషనల్ డి.యం.ఇ లు మెడికల్ కాలేజీ ప్రిన్సిపల్, హాస్పటల్ సూపరిండెంట్  డా.కె.చిట్టి నరసమ్మ, డా వెంకటేశ్వర్లు … వైద్య వృత్తిలో రోగి ప్రాణ రక్షణయే ప్రధాన ధర్మమని అందుకు గుడ్ క్లినికల్ ప్రాక్టీసెస్ తప్పని సరిగా పాటించాలని అడిషనల్ డియంఇ లు  కర్నూల్ మెడికల్ కాలేజీ ప్రిన్సిపల్ హాస్పటల్ సూపర్డెంట్ లు డా. కే. చిట్టి నరసమ్మ, డా. వెంకటేశ్వర్లు లు అన్నారు. వైద్యులు  తన కుటుంబ సభ్యులకు ఎంత జాగ్రత్తగా  వైద్యం చేస్తామో అది ప్రతి రోగి విషయంలో కూడా చూపాలని ప్రతి  రోగికి వైద్య సమాచారం  తెలపాలని  అన్నారు. ఇలాంటి శిక్షణల ద్వారా వైద్యులు తమ వృత్తి పరమైన బాధ్యతలను మరింత నిబద్ధతతో పాటించేందుకు అవకాశం ఉంటుందన్నారు. ఎపి మెడికల్ కౌన్సిల్ ప్రతినిధి, సిటివిఎస్ విబాగాధిపతి డాక్టర్ ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ వైద్య వృత్తి ఆన్నది సేవతో కూడిన బాధ్యత అని అన్నారు. రోగి ప్రాణాలు కాపాడటం, నిజాయితీగా వ్యవహరించడం లాభనష్టాల ప్రభావం లేకుండా రోగికి ఏది మంచిదో ఉపయోగపడే నిర్ణయాలు తీసుకోవడం అన్నది మెడికల్ ఎథిక్స్ యొక్క మూల సూత్రం అని తెలిపారు.  ఈ శిక్షణ కార్యక్రమము యంఏయు కో ఆర్డినేటర్,కమ్యూనిటీ మెడిషన్ విభాగాదిపతి, వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ సింధియా శుభప్రద ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతున్నది. ఈ కార్యక్రమంలో ఫార్మకాలజీ విభాగాధిపతి డాక్టర్ రాజేష్,కమ్యూనిటీ మెడిసిన్ అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ అరుణ, తదితరులు పాల్గొన్నారు.

About Author