అధ్వానమైన రోడ్డు కారణంగానే మరణాలు
1 min read

ముల్లా షఫివుల్లా, వైఎస్సార్సీపీ మండల కన్వీనర్ షఫీవుల్లా,
హొళగుంద న్యూస్ నేడు: మొకాలిలో గుంతలు వడి, రాళ్లు రప్పలు తేలి దారుణ స్థితికి చేరిన హొళగుంద- కణాపురం రోడ్డు కారణంగా రోగులకు అత్యవనర వైద్యం అందక మృత్యువాత వడ్తున్నారని వైఎస్సార్సీపీ మండల కన్వీనర్ షఫీవుల్లా ఆరోపించారు. ఇటివలే హొళగుందకు చెందిన ఖాజాసాబ్(36) అనే వ్యక్తి గుండెపోటుకు గురై మెరుగైన చికిత్స కోసం ఆదోనికి తరలిస్తుండగ మార్గ మధ్యలో మృత్యువాత పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. నదరు వ్యక్తిని హెబ్బటం మీదుగా తీసుకెళ్లాల్సి ఉండగ రోడ్డు బాగ లేకపోవడంతో ఎల్లార్తి మీదుగా తరలిస్తున్న సమయంలో కురుకుంద వద్ద తుదిశ్వాస విడిచినట్లు ఆయన వెల్లడించారు. సకాలంలో ఆస్పత్రికి చేరకపోవడంతోనే మృతి చెందినట్లు ఆయన ఆరోపించారు. అదేవిధంగా ఇదే గ్రామానికి చెందిన షాలి వలిభాష అనే వ్యక్తి కూడా గుండెపోటుకు గురవడంతో అతన్ని ఆదోని రోడ్డు బాగ లేకపోవడంతో బళ్లారికి తరలిస్తుండగ ఆయన కూడా మరణించినట్లు వెల్లడించారు. ఇలా రోడ్డు దారుణంగా ఉండడంవల్ల ఇలాంటి పరిస్థితి ఎదుర్కొంటున్నామని స్థానిక పిహెచ్సీలో కూడా గుండెపోటుకు సంబంధించి కొన్ని గంటల పాటు కాపాడెందుకు అవసరమైన వైద్యం లేదన్నారు. ఇలాంటి సంఘటనలు నెలలో ఒకటి, రెండు జరుగుతూ ఉంటాయని అయినా అధికారులు, ప్రభుత్వం రోడ్డు బాగు చెయడం, ఆరోగ్య కేంద్రాల్లో అత్యవసర వైద్యం అందించెందుకు అవసరమైన ఏర్పాట్లు చెయడం లేదని ఆరోపించారు. ఈ రోడ్డులో అడుగు అడుగుకు మోకాలోతు గుంతలు పడి ప్రయాణంలో నరకం కనబడుతుందని ఇటీవల కురిసిన వర్షానికి పరిస్థితి మరింత దిగజారుతుందని ఆవేదన వ్యకం చేశారు. పాలకులు, జిల్లా అధికారులు వెంటనే స్పందించి రోడ్డు, వైద్యం సమస్యను వెంటనే వరిస్కరించాలని ఆయన డిమాంద్ చేశారు.

