NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

దేవరగట్టులో భక్తులతో కిటకిట….

1 min read

ఆదివారం శ్రీ మాళమల్లేశ్వర స్వామివారికి విశేష పూజలు

హొళగుంద న్యూస్ నేడు: హొళగుంద మండలం దేవరగట్టు శ్రీ మాళమల్లేశ్వర స్వామి ఆలయం ఆదివారం భక్తులతో కిటకిటలాడింది. వివిధ ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఈ సందర్భంగా శ్రీ మాళమల్లేశ్వర స్వామివారికి అభిషేకం, బిల్వార్చన, బండారు అర్చన, కుంకుమార్చన, ఆకుపూజ తదితర పూజా కార్యక్రమాలను అర్చకులు గిరిస్వామి, మనోహర్ స్వామి నిర్వహించారు. ఆలయ మెట్ల వద్ద ప్రతి మెట్టుకు కర్పూరం వెలిగిస్తూ భక్తులు భక్తిశ్రద్ధలతో పూజలు చేశారు.అమ్మవారికి కుంకుమ, బండారు సమర్పిస్తూ భక్తులు మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయానికి వచ్చిన భక్తులకు నిర్వాహకులు అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. దీంతో ఆలయ ప్రాంగణం భక్తుల రద్దీతో సందడిగా మారింది.

About Author