త్రాగు నీటి సమస్య పరిష్కారానికి అధికారులు సమిష్టిగా కృషి చేయండి
1 min read
ఇక ఆలూరు లో 5 రోజులకు ఒక్కసారి నీటి సరఫరా అయ్యేలా చూడాలి
పంచాయతీ, ఆర్ డబ్ల్యూఎస్ అధికారుల సమీక్ష సమావేశం లో ఆలూరు టిడిపి ఇంచార్జీ శ్రీమతి వైకుంఠం జ్యోతి
ఆలూరు న్యూస్ నేడు : ఆలూరు నియోజకవర్గం లో తీవ్ర తరమవుతున్న త్రాగు నీటి సమస్య పరిష్కారానికి పంచాయతీ,ఆర్ డబ్ల్యూఎస్ అధికార్లు సమన్వయంతో పని చేసి ప్రజల దాహార్తిని తీర్చాలని ఆలూరు టిడిపి ఇంచార్జీ శ్రీమతి వైకుంఠం జ్యోతి సూచించారు. మంగళవారం ఆలూరు ఆర్ అండ్ బి అతిథి గృహం లో నియోజకవర్గ స్థాయి ఆర్ డబ్ల్యూఎస్,పంచాయతీ అధికారులతో త్రాగు నీటి సమస్యపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఆలూరు లో 14 రోజుల కు ఒక్కసారి నీళ్ళూ ఎందుకు సరఫరా అవుతున్నాయి…ప్రజలు ధర్నాలు చేయడం ఏమిటని ఆమె ప్రశ్నించారు. బాపురం రిజర్వాయర్ లో నీళ్ళు ఉన్న ఎందుకు ప్రజల దాహార్తిని తీర్చ లేకపోతున్నారని ప్రశ్నించారు..పంచాయతీ,ఆర్ డబ్ల్యూఎస్ శాఖల మధ్య సమన్వయం లేకపోవడం వల్లే ఈ సమస్య తలెత్తిందన్నారు. చెడిపోయిన బోర్లు మరమత్తులు చేయించాలన్నారు.ఇక ఆలూరు లో నీటి సమస్య రాకుండా చూడాల్సిన బాధ్యత ప్రతి అధికారి ,సిబ్బంది పై ఉందన్నారు. సక్రమంగా పని చేయని అధికార్లు,సిబ్బంది నియోజవర్గం నుంచి వెళ్లిపోవాలన్నారు. పైపు లైన్ లు,మోటార్లు చెడిపోతే తక్షణమే మరమత్తులు చేయించాలన్నారు..ఇక ప్రజలనుంచి త్రాగు నీటి సమస్య పై ఫిర్యాదులు రాకుండా చూసుకోవాలని ఆదేశించారు ఆర్ డబ్ల్యూఎస్ ,పంచాయతీ అధికార్లు,ఎంపీడీవో లు,కార్యదర్శులు పాల్గొన్నారు.


