350 ఎగ్జామ్ ప్యాడ్స్ పంపిణీ
1 min read

హోలగుందన్యూస్ నేడు: హొళగుంద మండలంలోని జూనియర్ కాలేజీలో విద్యార్థుల సౌకర్యార్థం 350 ఎగ్జామ్ ప్యాడ్స్ పంపిణీ కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది. ఆలూరు టీడీపీ ఇంచార్జ్ వైకుంఠం జ్యోతి మరియు టీడీపీ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ వైకుంఠం శివప్రసాద్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది.తెలుగు యువత మండల అధ్యక్షుడు బాకడి వీరేష్ నాయకత్వంలో విద్యార్థులకు ఎగ్జామ్ ప్యాడ్స్ అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా కాలేజీ ప్రిన్సిపాల్ మేడమ్ విద్యార్థుల విద్యాభివృద్ధికి ఇలాంటి సహాయ కార్యక్రమాలు ఎంతో ఉపయోగకరమని తెలిపారు.ఈ కార్యక్రమంలో టీడీపీ మండల కన్వీనర్ డా. తిప్పయ్య ఎం.డి హాలి సర్పంచ్ సుధాకర్ గారు, టీడీపీ యువనాయకుడు ఈబీజీ రాజేంద్ర గౌడ్ , రాష్ట్ర మైనారిటీ కార్యనిర్వాహక కార్యదర్శి కె.ఎం.డి ఆదం విద్యార్థులకు మార్గదర్శకంగా ప్రసంగించారు. విద్యే భవిష్యత్తుకు పునాది అని, విద్యార్థులు కష్టపడి చదివి ఉన్నత స్థానాలు సాధించాలని ఆకాంక్షించారు.అలాగే తెలుగు యువత మండల అధ్యక్షుడు బాకడి వీరేష్ భవిష్యత్తులో కూడా ఇలాంటి సేవా కార్యక్రమాలు మరింతగా నిర్వహించాలని నాయకులు ప్రశంసించారు.ఈ కార్యక్రమంలో మాజీ మండల కన్వీనర్ వీరన్ గౌడ్ , వందవగాలి సర్పంచ్ శేషన్న , టీడీపీ మండల మైనారిటీ అధ్యక్షుడు ముల్లా మోయిన్ , బీజేపీ సొసైటీ మెంబర్ ప్రసాద్, యువ నేత లబ్ గిరి , టీడీపీ యువనాయకుడు ఈబీజీ భువనేశ్ గౌడ్ ,టీడీపీ వెంకటేష్ టీడీపీ రామాంజీ ఐడీపీ మండల అధ్యక్షుడు నాగేంద్ర మలయ్య , మహేష్ తదితరులు పాల్గొన్నారు.విద్యార్థుల భవిష్యత్తు దృష్ట్యా నిర్వహించిన ఈ కార్యక్రమం విజయవంతంగా ముగిసింది.


