మెడికవర్ హాస్పిటల్స్, కర్నూల్‌లో మట్టి వినాయక విగ్రహాల పంపిణీ
1 min read

కర్నూలు, న్యూస్ నేడు: పర్యావరణ పరిరక్షణ లక్ష్యంతో, మెడికవర్ హాస్పిటల్స్, కర్నూలు పర్యావరణ కాలుష్య నియంత్రణ మండలితో కలిసి మట్టి వినాయక విగ్రహాల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించింది. ప్లాస్టర్ ఆఫ్ పారిస్ (PoP) విగ్రహాల వలన కలిగే పర్యావరణ నష్టాన్ని తగ్గించడమే ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశ్యం. ఈ కార్యక్రమంలో భాగంగా, సుమారు 100 మట్టి వినాయక విగ్రహాలో పండ్ల మొక్కల విత్తనాలను పెట్టి డాక్టర్ విశ్వ కుమార్ కన్సల్టెంట్ న్యూరో సర్జన్ మరియు డాక్టర్ సిద్ధార్థ్ హేరూర్, కన్సల్టెంట్ నెఫ్రాలజిస్ట్ మరియు మూత్రపిండ మార్పిడి వైద్యుడు పేషెంట్స్ మరియు ఎంప్లాయిస్కు వారికి అందచేశారు. ఈ సందర్భంగా మెడికవర్ హాస్పిటల్స్ క్లస్టర్ హెడ్ శ్రీ మహేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ, “పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత. పిఓపి విగ్రహాలు నీటిని, నేలని కాలుష్యం చేస్తాయి. మట్టి వినాయక విగ్రహాలో పండ్ల మొక్కల విత్తనాలను పెట్టడంద్వారా పర్యావరణ పరిరక్షణలో భాగమవుతుడి. ఆరోగ్యకరమైన సమాజం కోసం పర్యావరణాన్ని కాపాడుకోవాలి. ఇలాంటి సామాజిక కార్యక్రమాలకు మా ఆసుపత్రి ఎల్లప్పుడూ మద్దతు ఇస్తుంది మరియు పర్యావరణ హితమైన చర్యలకు తోడ్పడుతుంది” అన్నారు.ఈ కార్యక్రమంలో కాలుష్య నియంత్రణ మండలి అధికారులు, మెడికవర్ హాస్పిటల్స్ వైద్యులు, సిబ్బంది మరియు స్థానిక ప్రజలు చురుకుగా పాల్గొన్నారు. ప్రజలందరూ పర్యావరణ హిత వినాయక చవితిని జరుపుకోవాలని పిలుపునిచ్చారు.


