NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

శ్రీ మఠానికి రూ .లక్ష విలువ చేసే బంగారు చైన్ విరాళం

1 min read

మంత్రాలయం న్యూస్ నేడు :  ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన మంత్రాలయం శ్రీ రాఘవేంద్ర స్వామి మఠానికి  విజయవాడ కు చెందిన న్యాయవాది దుర్గంపుడి వేణుగోపాల్ రెడ్డి, సుధారాణి దంపతులు రూ లక్ష విలువ చేసే బంగారు చైన్ ను  శ్రీ మఠం మేనేజర్ వెంకటేష్ జోషి కి ఆదివారం విరాళంగా అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ బంగారు చైన్ ఎనిమిది గ్రాములు ఉందని, దిని విలువ సుమారు లక్ష రూపాయలు అని దాతలు తెలిపారు. వీరికి శ్రీ మఠం  మేనేజర్ ప్రత్యేక దర్శన సదుపాయం కల్పించారు. వీరు ముందుగా గ్రామదేవత మంచాలమ్మను దర్శించుకుని కుంకుమార్చన, మహా మంగళారతి వంటి విశేష పూజలు చేపట్టారు.అనంతరం శ్రీ రాఘవేంద్ర స్వామి మూల బృందావనాన్ని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. వీరితోపాటు దాతల కుమారుడు గుణశేఖర్ రెడ్డి, కుమార్తె దేవి శ్రీ ,బీసీ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వడ్డే నారాయణ,సూపరిడెంట్ అనంత పురాణిక్ తదితరులు పాల్గొన్నారు.

About Author