NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

అర్జీలు రీఓపెన్ కానివ్వొద్దు…

1 min read

నగరపాలక సంస్థ కమిషనర్ పి.విశ్వనాథ్

కర్నూలు, న్యూస్​ నేడు:  సోమవారం ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమానికి వచ్చే అర్జీలు రీఓపెన్ కానియోద్దని నగరపాలక సంస్థ కమిషనర్ పి.విశ్వనాథ్ అధికారులను ఆదేశించారు. సోమవారం స్థానిక ఎస్బిఐ ఎంప్లాయిస్ కాలనీలోని నగరపాలక సమావేశ భవనంలో  నిర్వహించిన పిజిఆర్‌యస్‌కు 9 అర్జీలు వచ్చాయి. వాటి పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని కమిషనర్ పేర్కొన్నారు. మేనేజర్ చిన్నరాముడు, ఎస్ఈ రమణమూర్తి, ప్రజారోగ్య అధికారి డాక్టర్ నాగ ప్రసాద్, ఎంఈ మనోహర్ రెడ్డి, ఇంచార్జీ సిటీ ప్లానర్ వై.వెంకటరమణ, తదితరులు పాల్గొన్నారు.

About Author