NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ఘనంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వర్ధంతి వేడుకలు

1 min read

నందికొట్కూరు, న్యూస్​ నేడు:  భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 69వ వర్ధంతి వేడుకలను నందికొట్కూరు పట్టణంలో ఘనంగా నిర్వహించారు.నంద్యాల జిల్లా నందికొట్కూరు పట్టణంలో మాల మహానాడు తాలూకా అధ్యక్షులు డాక్టర్ వెంకటేష్ ఆధ్వర్యంలో శనివారం ఘనంగా నిర్వహించారు. పట్టణంలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలతో ఘనంగా నివాళులు అర్పించారు.ఈ సందర్భంగా వెంకటేష్ మాట్లాడుతూ దళిత బహుజన వర్గాల అభ్యున్నతికి కృషి చేసిన మహనీయుడు, భారతరత్న,భారత రాజ్యాంగ నిర్మాతగా  భారతదేశ  ఔన్నత్యాన్ని ప్రజాస్వామ్య  స్ఫూర్తిని విశ్వవ్యాపితం చేసిన మహోన్నత కీర్తి శిఖరం భారతరత్న డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా ఆ మహనీయునికి ఘనంగా నివాళులు అర్పించడం జరిగిందన్నారు.ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షులు బండారి శ్రీనివాసులు,పెరుమాళ్ళ మధు,చెరుకు నడిపెన్న, సగినేల భక్షాలు,చెరుకు శేఖర్, కదిరి ధర్మరాజు,యేసురత్నం, రాజు,డాలు శ్రీను,యేసు రత్నం,శేషు,సురేష్, పాల్గొన్నారు.

About Author