మాదకద్రవ్యాల పై అవగాహన
1 min read
ఏలూరు జిల్లాప్రతినిధి,న్యూస్ నేడు: ఏలూరు ఎస్ పి కె. ప్రతాప్ శివ కిషోర్ ఆదేశాల మేరకు, ఈగల్ డిపార్ట్మెంట్ మరియు ఏలూరు టూ టౌన్ పోలీస్ ఆధ్వర్యంలో, ఏలూరు డి ఎస్ పి శ్రావణ్ కుమార్ అధ్యక్షతన ఈగల్ సెంటర్ ఆఫ్ ఎక్స్లెన్స్ లో భాగంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సాంఘిక సంక్షేమ శాఖ బాలురు వసతి గృహం లో మాదకద్రవ్యాల పై అవగాహన కార్యక్రమం నిర్వహించబడింది.ఈ కార్యక్రమంలో గంజాయి మరియు మాదకద్రవ్యాలపై అవగాహన, ఏన్ డి పి ఎస్ చట్టంలోని నిబంధనలు, డ్రగ్స్ వల్ల కలిగే శారీరక, మానసిక, సామాజిక దుష్ప్రభావాలపై విద్యార్థులకు వివరించారు. గంజాయి సేవించడం ఎన్ డి పి ఏస్ చట్టంలోని సెక్షన్ 27 ప్రకారం నేరమని, ఒక సంవత్సరం వరకు జైలు శిక్ష పడవచ్చని తెలియజేసి, డ్రగ్స్ పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు.హాస్టల్‌లో అసాంఘిక కార్యకలాపాలు నివారించేందుకు సీసీ కెమెరాలు తక్షణమే ఏర్పాటు చేయాలని మరియు హాస్టల్‌కు బయట వ్యక్తులు హాస్టల్ ప్రాంగణంలోకి వచ్చి విద్యార్థులకు చెడు వ్యసనాలు అలవాటు చేసే వ్యక్తులను గుర్తించి వెంటనే లోకల్ పోలీసులకు లేదా ఈగల్ డిపార్ట్మెంట్ కు తెలియపరచవలసిందిగా డి ఎస్ పి వార్డెన్‌కు మరియు ఇతర ఉన్నతాధికారులను ఆదేశించారు. గంజాయి వంటి మాదకద్రవ్యాలు వినియోగించిన లేదా అనుమానం ఉన్నవారిని డ్రగ్ డిటెక్షన్ కిట్ ద్వారా పరీక్షించి, తగిన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. మాదకద్రవ్యాలకు సంబంధించిన సమాచారం ఉన్నట్లయితే ఈగల్ టోల్ ఫ్రీ నెంబర్ 1972కు తెలియజేయాలని, తెలియపరిచిన వారి వివరాలు గోప్యంగా ఉంచబడతాయని విద్యార్థులకు తెలియజేశారు.ఈ కార్యక్రమానికి టూ టౌన్ సీఐ అశోక్ కుమార్, ఈగల్ ఆర్ ఎస్ ఐ ఉదయభాస్కర్ మరియు ఇతర పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.


