NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

పది ఫలితాలలో రాష్ట్రంలోనే ఏలూరు జిల్లాను ప్రథమ స్థానంలో నిలుపుదాం

1 min read

విజయకేతనం 3.0 పుస్తక మహోత్సవం 2025-26 మరియు విద్యార్థులకు పంపిణీ

కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా పరిషత్ చైర్ పర్సన్ ఘంటా పద్మశ్రీ,ఎమ్మెల్యే బడేటి చంటి

ఏలూరుజిల్లా ప్రతినిధి,న్యూస్ నేడు : స్థానిక జిల్లా పరిషత్తు సమావేశం మందిరంలో శనివారం  పదవతరగతి స్టడీమెటీరియల్ విజయకేతనం 3.0 పుస్తక మహోత్సవంలో జిల్లా పరిషత్ చైర్ పర్సన్ ఘంటా పద్మశ్రీ, ఏలూరు ఎమ్మెల్యే బడేటి రాధాకృష్ణయ్య ( చంటి) సంయుక్తంగా పాల్గొని, విద్యార్థిని, విద్యార్థులకు పుస్తకాలను పంపిణీ చేశారు.ఈ సందర్భంగా జిల్లా పరిషత్ చైర్ పర్సన్ ఘంటా పద్మశ్రీ మాట్లాడుతూ జిల్లాలో నిరుపేద విద్యార్థులకు విద్యా ప్రమాణాలను మెరుగు పరచడం లక్ష్యంగా విజయకేతనం 3.0 పుస్తకాలు 100 రోజుల కార్యాచరణ ప్రణాళిక ఆధారంగా రూపొందించ పడ్డాయని తెలిపారు. గత సంవత్సరం ఈ పుస్తకాలు వలన పదవతరగతి ఉత్తీర్ణత శాతం గణనీయంగా పెరిగిందని చెప్పారు. ఈ సంవత్సరం కూడా అదే స్థాయిలో విద్యార్థులకు మార్గదర్శకంగా ఉండాలని ఆకాంక్షించారు.ఈ సంవత్సరం జిల్లా పరిషత్తు నిధులతో 30,327 పుస్తకాలు పేద విద్యార్థులకు పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. జిల్లాలోని నిపుణులైన ఉపాధ్యాయులచే ప్రత్యేకంగా రూపొందించిన ఈ పుస్తకాలు విద్యార్థులకు ఉత్తమ సాధనంగా నిలుస్తాయని అన్నారు. ఈ పుస్తకాన్ని రూపొందించిన ఉపాధ్యాయులను ఈ సందర్భంగా అభినందించారు. మనం రూపొందించిన విజయకేతనం స్టడీ మెటీరియల్ రాష్ట్రానికి ఆదర్శంగా నిలిచిందని అన్నారు. సబ్జెక్టులలో వెనుకబడిన విద్యార్ధులపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుని, ప్రత్యేక తరగతులు నిర్వహించాలని అన్నారు. గత సంవత్సరం కంటే మెరుగైన ఫలితాలు తీసుకురావటానికి ఉపాద్యాయులు మరియు విద్యాశాఖ అధికారులు సమిష్టిగా కృషి చెయ్యాలని సూచించారు.ఏలూరు ఎమ్మెల్యే బడేటి రాధాకృష్ణయ్య (చంటి) మాట్లాడుతూ రాష్ట్ర ఐటి, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ విద్యావిధానంలో అనేక మార్పులు  తీసుకువచ్చారని, ప్రతి ఒక్కరూ ఉన్నత చదువులు చదువుకోవాలని అన్నారు.ఈ సమావేశంలో ఉడా చైర్ పర్సన్ పెద్దిబోయిన వాణి వెంకట శివప్రసాదు, ఏలూరు మండల పరిషత్తు అధ్యక్షులు పెన్మెత్స శ్రీనివాస రాజు, బిసి నాయకులు ఘంటా ప్రసాదరావు, జిల్లా పరిషత్తు సిఇవో యం.శ్రీహరి, జిల్లా విద్యాశాఖ అధికారి యం.వెంకటలక్ష్మమమ్మ, జిల్లా పరిషత్తు, విద్యాశాఖ అధికారులు, ప్రధానోపాధ్యాయులు,ఉపాధ్యాయులు, విద్యార్థిని, విద్యార్థులు, తదితరులు హాజరయ్యారు.

About Author