NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ఎల్ నినో పుస్తక ఆవిష్కరణ

1 min read

జిల్లా కలెక్టర్ డా. ఏ. సిరి

కర్నూలు , న్యూస్​ నేడు:  కర్నూలు జిల్లాలో ఖరీఫ్ సీజన్ లో ఎల్ నినో ప్రభావం దృష్ట్య ప్రకృతి వ్యవసాయం ద్వారా ఎల్ నినో పరిస్థితిని ఎదుర్కొని  విజయవంతంగా వ్యవసాయం చేసే ప్రకృతి వ్యవసాయ విధానాలు మరియు పద్ధతుల గురించిన పుస్తకం ను గౌరవనీయులు జిల్లా కలెక్టర్ డా. ఏ. సిరి  తమ కార్యాలయం లో ఎల్ నినో పుస్తకం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్  మాట్లాడుతూ వ్యవసాయ అధికారులు, ప్రకృతి వ్యవసాయ సిబ్బంది అందరూ  రైతులందరూ పూర్తిస్థాయిలో ఎల్ నినో ప్రభావాన్ని ఎదుర్కొనే విధంగా రైతులకు ఒకే రకమైన పంట కాకుండా పలు రకాల పంటలు వేసుకొనే విధంగా అవగాహన కల్పించి రాబోయే ఖరీఫ్ సీజన్లో మంచి దిగుబడిలో వచ్చేల అవగాహన కల్పించాలని తెలియజేశారు,  ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారిణి శ్రీమతి పి.ఎల్. వరలక్ష్మీ , ప్రకృతి వ్యవసాయ జిల్లా డిపిఎం శ్రీమతి ఏ. మాధురి , డిఎల్ఎంపి లక్ష్మయ్య  మరియు ప్రకృతి వ్యవసాయ సిబ్బంది పాల్గొన్నారు.

About Author