NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ప్రతి అర్జీని పరిశీలించి శాశ్వత పరిష్కారం చూపాలి

1 min read

అధికారులు  క్షేత్రస్థాయిలో పర్యటించి సమస్యలను నాణ్యతతో  పరిష్కరించి, పెండింగు లేకుండా చూడాలి

పిజిఆర్ఎస్ లో వచ్చిన అర్జీలు 454

జిల్లా కలెక్టరు కె.వెట్రిసెల్వి

ఏలూరు జిల్లా ప్రతినిధి న్యూస్ నేడు: జిల్లా కలెక్టరేటు గోదావరి సమావేశ మందిరంలో సోమవారం జిల్లా స్థాయి ప్రజాసమస్యలు పరిష్కార వేదిక కార్యక్రమాన్ని జిల్లాస్థాయీ అధికారులతో జిల్లా కలెక్టరు కె.వెట్రిసెల్వి నిర్వహించారు. జిల్లా కలెక్టరుతో పాటు జిల్లా జాయింటు కలెక్టరు యం.జె. అభిషేక్ గౌడ, జిల్లా రెవెన్యూ అధికారి వి.విశ్వేశ్వర రావు, ఆర్డీవో యం.అచ్యుత అంబరీష్, డిప్యూటీ కలెక్టరు యల్.దేవకిదేవి, ఎస్సి కార్పొరేషన్ ఇడి యం. ముక్కంటి, డిఆర్డీఏ పిడి ఆర్.విజయరాజులు స్వీకరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టరు కె.వెట్రిసెల్వి మాట్లాడుతూ  ప్రజా ఫిర్యాదుల పరిష్కారంపై ప్రజలు సమర్పించిన అర్జీలు పరిష్కారానికి అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని  అధికారులను ఆదేశించారు. అధికారులు క్షేత్రస్థాయిలో ఫిర్యాదు దారులతో  స్వయంగా మాట్లాడి నాణ్యమైన  పరిష్కారాన్ని చూపాలన్నారు. శాఖలు వారీగా వచ్చిన అర్జీలను పరిశీలించి తక్షణమే పరిష్కార చర్యలు చేపట్టాలన్నారు. అర్జీలు పరిష్కారంలో బాధ్యతాయుతంగా వ్యవహరించాలని, నిర్లక్ష్యానికి తావు లేదని అధికారులు కలసికట్టుగా పనిచెయ్యాలని సూచించారు. అర్జీలు రీ-ఓపెన్‌కు ఆస్కారం లేకుండా పరిష్కారం చూపాలని, అదే ఫిర్యాదు రెండవ సారి వచ్చినట్లయితే ఆయా అధికారి వైఫల్యం చెందినట్లేనని అటువంటి అధికారులను శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని అన్నారు.ఈ కార్యక్రమంలో వివిధ శాఖల జిల్లా  అధికారులు, జిల్లా కలెక్టరేటు సూపర్డెంట్లు, తదితర ఉద్యోగులు పాల్గొన్నారు.

About Author