NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

రైల్వే సమస్యలపై పోరాడండి మీ వెంట మేమున్నాం

1 min read

 రైల్వే సమస్యలపై సిపిఎం చేపట్టిన 2వ రోజు దీక్షలకు మద్దతు తెలిపిన

 వివిధ సంఘాల నాయకులు.**

 కర్నూల్ నుండి విజయవాడకు ఇంటర్సిటీ నడపకపోతే ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తాం.

 సిపిఎం నేత పి నిర్మల హెచ్చరిక.

కర్నూలు, న్యూస్​ నేడు:  కర్నూల్ నుండి విజయవాడకు ఇంటర్సిటీ ట్రైన్లు నడపకపోతే ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యురాలు పి నిర్మల హెచ్చరించారు. కర్నూల్ నగర ప్రజలకు రైళ్ల సౌకర్యాలు కల్పించాలని కోరుతూ సిపిఎం పార్టీ చేపట్టిన నిరసన దీక్ష రెండవ రోజు సిపిఎం పార్టీ న్యూ సిటీ కార్యదర్శి రాముడి అధ్యక్షతన జరిగింది. ఈ కార్యక్రమాన్నీ నిర్మల ప్రారంభిస్తూ  మాట్లాడారు.  రాష్ట్రాన్ని విడగొట్టాడానికి బిజెపి మద్దతు ఇచ్చింది తప్ప రాజధానికి కనీసం రవాణా సౌకర్యాన్ని  ఏర్పాటు చేయడంలో  ఘోరంగా వైఫల్యం చెందిందని ఆరోపించారు. ఈ 11 సంవత్సరాల కాలంలో పాలకులు మారారు ప్రభుత్వాలు మారాయి కానీ కర్నూలు నగర ప్రజలకు మాత్రం ఆవగింజంత మేలు కూడా జరగలేదని ఆమె ఆరోపించారు. పాత రాజధాని అని చెప్పుకుంటూ తిరుగుతున్న పాలక పార్టీల నాయకులు అలాంటి రాజధాని ప్రజలకు కనీస రవాణా సౌకర్యం కూడా కల్పించడంలో ఘోరంగా వైఫల్యం చెందారని ఆమె విమర్శించారు ఓట్లకు మాత్రమే ప్రజల దగ్గరకు వచ్చి నంగనాచి మాటలు చెబుతూ గెలిచిన తర్వాత వస్తుండు రాజా లాగా మిగిలారని ఆమె ఘాటుగా విమర్శించారు. కనీసం కాచిగూడ ట్రైన్ విజయవాడ వరకు పొడిగించడానికి ఎందుకు చేతకావడం లేదు సమాధానం చెప్పాలని ఆమె నినదీశారు. మోడీ ప్రభుత్వం చంద్రబాబుపై ఆధారపడినప్పుడు ఆంధ్ర రాష్ట్రానికి అనేక సౌకర్యాలు కల్పించే అవకాశం ఉన్నప్పటికీ చంద్రబాబు నాయుడు ఎందుకు  ప్రధానమంత్రి పై ఒత్తిడి తెచ్చి నిధులు రాబట్టట్లేదు సమాధానం చెప్పాలని ఆమె తెలిపారు. ప్రజలు విజయవాడకు వెళ్లాలంటే బస్సుల పైన ఆధారపడిన దౌర్భాగ్య పరిస్థితి వచ్చిందని, ఎప్పుడు  ప్రమాదాలు జరుగుతాయో భయభ్రాంతులతో ప్రజలు ప్రయాణాలు చేయాల్సిన పరిస్థితి ఉందని ఘాట్ లో వెళ్లాలంటే నరకమే ప్రజలు చెవి చూస్తున్నారని ఆమె విమర్శించారు. ఒక పైసా ఖర్చు లేకుండా కాచిగూడ గుంటూరు వరకు ఉన్న రెండు రైళ్లను సమయంలో మార్పు చేసి విజయవాడ వరకు పొడిగించడానికి వీరికి ఉన్న ఇబ్బంది ఏమిటని ఆమె ప్రశ్నించారు?  కర్నూల్ నుండి విజయవాడ వరకు ఇంటర్సిటీ ట్రైన్ నడపకపోతే ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని ప్రజా ఉద్యమంగా మారుస్తామని ఆమె కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు హెచ్చరించారు.ఈ దీక్షలకు మద్దతు తెలుపుతూ మాట్లాడిన విజయ్ కుమార్ రెడ్డి  మాట్లాడుతూ ఒక రైల్వే బోర్డు మెంబర్ గా ఉంటూ ఈ ప్రభుత్వాల పాలన చూస్తుంటే సిగ్గు అనిపిస్తుందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు కనీసం ప్రధానమంత్రి వచ్చినప్పుడన్నా మన జిల్లాకు మన ప్రాంతానికి మేలు జరుగుతుందని భావించాను కానీ అలాంటి మేలు ఏమీ జరగకపోగా 300 కోట్ల రూపాయలకు పైగా ప్రజాధనం వృధా అయిందని ఆయన తెలిపారు. గతంలో కర్నూల్ నుండి హైదరాబాద్కు ఇంటర్సిటీ కావాలని సిపిఎం పార్టీ ప్రజల మద్దతుతో పోరాటం చేయడం వల్ల ఇంటర్సిటీ వచ్చిందని మళ్లీ రాజధాని మారడం వల్ల కర్నూల్ నుండి విజయవాడకు ఇంటర్సిటీ నడపాలని చేస్తున్న పోరాటానికి మా వ్యాపార సంస్థలు మద్దతుగా ఉంటాయని అండగా ఉంటాయని ఆయన తెలిపాడు. ఆ తర్వాత ఆయిల్ అండ్ రైస్ మిల్ అసోసియేషన్ అధ్యక్షులు రామిరెడ్డి  కార్యదర్శి సురేష్ రెడ్డిఅసోసియేషన్ సభ్యులు రమణ శంకర్ గారు మద్దతు తెలియజేస్తూ నాయకులకు పూలదండలు వేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రం విడిపోయిన తర్వాత కర్నూల్ నగరానికి చాలా అన్యాయం జరిగిందని రవాణా సౌకర్యాలు లేకపోవడంతో వ్యక్తిగత వాహనాలు వెళ్లాలన్నా శ్రీశైలం ఘాట్ లో  సింగల్ రోడ్డు ఉండటం వల్ల అనేక అవస్థలు పడాల్సి వచ్చింది అని వారు తెలిపారు సిపిఎం పార్టీ చాలా మంచి పోరాటాన్ని ఎంచుకున్నారని ఆ పోరాటానికి మా మద్దతు ఎల్లవేళలా ఉంటుందని వారు తెలిపారు. అలాగే ఆలిండియా లాయర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షులు లక్ష్మణ్ , సెంటర్ ఆఫ్ ఇండియన్ ట్రేడ్ యూనియన్  జిల్లా అధ్యక్షులు రాధాకృష్ణ, ఆల్ ఇండియా కిసాన్ సభ జిల్లా ప్రధాన కార్యదర్శి జి రామకృష్ణ, ఐద్వా జిల్లా కార్యదర్శి కె.అరుణ డైఫీ జిల్లా అధ్యక్షులు రాఘవేంద్ర లు మాట్లాడుతూ నేడు కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం మన రాష్ట్ర ఎంపీల మద్దతుపై ఆధారపడి ఉంది. ఇలాంటి తరుణంలో కూడా కర్నూల్ నగర ప్రజలకు రైల్వే సౌకర్యాలు కలగకపోతే ఇంకెప్పుడు వస్తాయో అర్థం కాని పరిస్థితి ఉంటుందని వారు తెలిపారు. ఒకప్పటి కర్నూలు రాజధాని నుండి ఇప్పటి రాజధాని అమరావతికి రైళ్లను, మరియు ప్రతిష్టాత్మకమైన పుణ్యక్షేత్రాలు శ్రీశైలం మంత్రాలయం మధ్య కొత్త రైల్వే లైన్ mఏర్పాటుకు ఒత్తిడి చేసి సాధించుకోకపోవడం వారి చేతగానితనమని ఆరోపించారు. కర్నూలుకు నరేంద్ర మోడీని పిలిచి నాలుగు వందల కోట్లు ఖర్చుపెట్టి ఏం సాధించారు ప్రజలకు చెప్పాలన్నారు.సిపిఎం పార్టీ చేపట్టిన ఈ పోరాటానికి మా సంపూర్ణ మద్దతు ఉంటుందని వారు తెలియజేశారు.   సిపిఎం పార్టీ నిస్వార్ధంగా ప్రజల యొక్క అవసరాలను దృష్టిలో పెట్టుకొని ప్రజల సౌకర్యార్థం రైల్వే అభివృద్ధి, రైల్వే సమస్యలు పరిష్కరించాలని కోరడం ఆహ్వానించదగ్గ విషయమని తెలిపారు.  అనంతరం సిపిఎం జిల్లా కార్యదర్శి డి గౌస్ దేశాయ్ మాట్లాడుతూ రైల్వే సమస్యలపై మూడో తేదీ స్పష్టమైన హామీ ఇవ్వాలని అధికారులకు తెలియజేశాడు. లేకపోతే ఇక్కడే బయఠా ఇస్తామని హెచ్చరించాడు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఎండి ఆనంద్ బాబు, జిల్లా కమిటీ సభ్యులు నగేష్ నగర కార్యదర్శి వర్గ సభ్యులు సిహెచ్ సాయి బాబా, సుధాకరప్ప, కే ప్రభాకర్ ఆర్ నరసింహులు నాయకులు బి.రాధాకృష్ణ ఏసన్న, హుస్సేన్ భాష, రామకృష్ణ మహమ్మద్ రఫీ మాజీ కార్పొరేటర్ చలపతి, PNM జిల్లా నాయకులు రాజు, లోకేష్, బతకన్న,బాలయ్య, డైఫీ జిల్లా కార్యదర్శి అబ్దుల్లా, ఐద్వా జిల్లా అధ్యక్షులు శ్యామల, మాజీ జిల్లా కార్యదర్శి రత్నమ్మ, నాయకులు సావిత్రి లత షమీనా కెవిపిఎస్ నగర కార్యదర్శి భాస్కర్, జిల్లా నాయకులు పెదబాబు సిఐటియు జిల్లా నాయకులు ఎం గోపాల్, నాయకులు వలి తదితరులు పాల్గొన్నారు.

About Author