NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

మట్టి మిద్దె కూలి మరణించిన కుటుంబానికి ఆర్థిక సాయం

1 min read

విద్యార్థిని ప్రసన్నకు ..4 లక్షల 50 వేల చెక్కును అందించిన కలెక్టర్..

 నంద్యాల, న్యూస్​ నేడు : నంద్యాల జిల్లాచాగలమర్రి మండలం, చిన్నవంగలి గ్రామానికి చెందిన తల్లపురెడ్డి గురుశేఖర్ రెడ్డి మట్టిమిద్దే కూలి అక్కడికక్కడే నలుగురు కుటుంబ సభ్యులు మృతి చెందడం జరిగింది.సోమవారం పిజిఆర్ఎస్ హాల్లో జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియా చేతుల మీదుగా మృతుల కుటుంబ సభ్యులకు రూ.4.50 లక్షల మెగా చెక్కును అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రాజకుమారి మాట్లాడుతూ నంద్యాల జిల్లా చాగలమర్రి మండలం,చిన్నవంగలి గ్రామంలో 02.08.2024 న భారీ వర్షాల వల్ల మట్టిమిద్దే కూలి (తల్లపురెడ్డి గురుశేఖర్ రెడ్డి) కుటుంబ యజమాని, భార్య దస్తగిరమ్మ,కుమార్తెలు పవిత్ర,గురులక్ష్మి,నలుగురు అక్కడికక్కడే మృతి చెందడం జరిగిందన్నారు.కాగా తల్లపురెడ్డి గురుశేఖర్ రెడ్డి రెండవ కుమార్తె ప్రసన్న ప్రొద్దుటూరులోని ప్రభుత్వ హాస్టల్లో చదువుతూ ఉండటంతో ప్రమాదం నుంచి బయటపడిందన్నారు. కుటుంబ సభ్యులందరూ మృతి చెందడంతో ఆమె దిక్కులేని విద్యార్థినిగా మిగిలిపోయింది.దీంతో కడప జిల్లా,ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంకు కానగూడూరు బ్రాంచ్ వారు పిఎంఎస్ బివై నుంచి రూ. 2 లక్షలు,మరియు పిఎం జెజెవై నుంచి రూ.2లక్షలు, క్రాప్ లోన్ యాక్సిడెంటల్ బీమాకు సంబంధించి రూ.50 వేలు,మొత్తం రూ.4.50 లక్షల మెగా చెక్కును జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా విద్యార్థిని ప్రసన్న,మరియు ఆమె అవ్వ ఆవుల  రామసుబ్బమ్మకు చెక్కును అందజేశారు.ప్రసన్న చిన్న వయసులోనే కుటుంబ సభ్యులందరినీ కోల్పోయి ఒంటరి విద్యార్థినిగా ఉండడం చాలా బాధాకరంగా ఉందన్నారు.ప్రస్తుతం ప్రసన్న కడపలోని నారాయణ కళాశాలలో మొదటి సంవత్సరం ఇంటర్మీడియట్ ఎంపీసీ చదువుతోందని ఆమె చదువుకు పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని ప్రసన్న బాగా చదివి భవిష్యత్తులో మంచి ఉద్యోగం సంపాదించాలని కలెక్టర్ ఆకాంక్షించారు.

About Author