నేషనల్ కాన్ఫరెన్స్ లో కె.యం.సి పీడియాట్రిక్ సర్జరీ పి.జి కి మొదటి బహుమతి
1 min read

కర్నూలు, న్యూస్ నేడు: జాతీయస్థాయిలో కోయంబత్తూరులో ఇటీవల నిర్వహించిన పీడియాట్రిక్ సర్జరీ విభాగపు నేషనల్ కాన్ఫరెన్స్ , స్పూకాన్ (SPUCON) యందు కర్నూల్ మెడికల్ కాలేజీ యందు చదువుతున్న పీడియాట్రిక్ సర్జరీ విభాగపు పీజీ ద్వితీయ సంవత్సరము విద్యార్థిని డా. ప్రియాంక ఇ- పోస్టర్ విభాగం లో జాతీయ స్థాయిలో మొదటి బహుమతి సాధించటం పట్ల అడిషనల్ డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ కర్నూలు మెడికల్ కాలేజీ ప్రిన్సిపల్ డాక్టర్ కే.చిట్టి నరసమ్మ సదరు విద్యార్థిని మరియు పీడియాట్రిక్ సర్జరీ విభాగపు అధిపతి డా. శివకుమార్ ను వారి విభాగపు వైద్యులను అభినందించారు. డా. ప్రియాంక ను ఆదర్శంగా తీసుకోవాలని జాతీయ స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో ప్రతిభ కనపరిచిన విద్యార్థులకి ప్రోత్సాహకాలు అందిస్తామన్నారు.

