NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

దొంగతనాల కేసులో ఐదుగురు అరెస్టు

1 min read

బంగారు వెండి స్వాధీనం-బ్రాహ్మణకొట్కూరు ఎస్సై మణికంఠ..

న్యూస్ నేడు నందికొట్కూరు: ఇండ్లల్లో దొంగతనాలు చేసిన ఐదుగురిని అరెస్టు చేసి రిమాండ్కు పంపినట్లు బ్రాహ్మణ కొట్కూరు ఎస్సై వి మణికంఠ తెలిపారు.నంద్యాల జిల్లా బ్రాహ్మణ కొట్కూరు ఎస్సై మణికంఠ శనివారం సాయంత్రం తెలిపిన వివరాల మేరకు  ఫిబ్రవరి నెలలో బ్రాహ్మణ కొట్కూరు,అల్లూరు గ్రామాల్లో మరియు పాణ్యంలో జరిగినటువంటి ఇండ్ల దొంగతనాల కేసుల్లో ఐదుగురు ముద్దాయిలను శనివారం అరెస్టు చేసి రిమాండ్ కు పంపినట్లు అదేవిధంగా వారి వద్దనున్న  సుమారు 22 తులాల వెండి ఆభరణాలు అర తులం బంగారు ఆభరణములు మరియు వారు నేరంనకు ఉపయోగించిన రెండు మోటార్ సైకిళ్లను స్వాధీనం చేసుకున్నామని అన్నారు. అల్లూరులోనే కాకుండా పాణ్యం మరియు  కర్నూలు లో కూడా దొంగతనాలు వారు చేశారని వారు విచారణలో ఒప్పుకున్నట్లు తెలిపారు.  రానున్న వేసవి కాలంలో ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని దొంగతనాలు జరిగే అవకాశం ఉంది కనుక ప్రతి ఒక్కరూ ఇతర గ్రామాలకు వెళ్ళినప్పుడు జాగ్రత్తగా ఉండాలని ప్రజలకు ఎస్ఐ సూచించారు.విలువైన వస్తువులను ప్రత్యేకంగా లాకర్లలో ఉంచుకోవాలని అన్నారు.

About Author