10వ తరగతి విద్యార్థులకు ఉచితంగా స్టడీ మెటీరియల్ పంపిణీ
1 min read

హోళగుందన్యూస్ నేడు: పదవతరగతి లో మెరుగైన మార్కులు సాధించడానికి ఎస్టీయు రాష్ట్ర అకడమిక్ కమిటీ రూపొందించిన ఎస్ఎస్సి స్టడీ మెటీరియల్ ను హొళగుంద జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల యందు, పూర్వ మండల విద్యాశాఖ అధికారి 2 అయిన శ్రీ జగన్నాథం ఆర్థిక సహాయంతో 100 మంది సి,డి గ్రేడ్ ( వెనుకబడిన) విద్యార్థులకు (7 వేలు రూపాయలు విలువగల) స్టడీ మెటీరియల్ ను అందించడం జరిగింది. ఎస్టీయు జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం.సి సుంకన్న , పాఠశాల హెడ్మాస్ట మరియు ఎం ఈ ఓ 2 అయినా శ్రీ పి కబీర్ సాబ్ చేతులు మీదుగా జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల హొళగుంద నందు 100 మంది విద్యార్థినీ, విద్యార్థులకు అందజేశారుఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఎస్టీయు జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం.సి సుంకన్న మాట్లాడుతూ.. ఈ సంవత్సరం మెరుగైన ఫలితాలు సాధించడానికి నిష్ణాతుల చేత తయారు చేయబడిన ఈ స్టడీ మెటీరియల్ ని బాగా ఉపయోగించుకుని మంచి ఫలితాల తో ఉత్తీర్ణత సాధించాలని కోరారు.ఈ స్టడీ మెటీరియల్ విద్యార్థులకు ఎంతో ఉపయోగకరమని, గతంలో ఈ స్టడీ మెటీరియల్ నందు దాదాపుగా ఎక్కువ ప్రశ్నలు రావడం జరిగిందని,ఈ సంవత్సరం మార్చిలో జరగబోయే ఎస్ఎస్సి పరీక్షల్లో ఈ స్టడీ మెటీరియల్ ను విద్యార్థులు చక్కగా సాధన చేసి మంచి మార్కులతో ఉత్తీర్ణత సాధించాలని ఆకాంక్షించారు.ఈ సందర్భంగా మండల విద్యాశాఖ అధికారి 2 శ్రీ పి కబీర్ సాబ్ మాట్లాడుతూ మెటీరియల్ ను బాగా ఉపయోగించుకుని మంచి ఫలితాలు సాధించి పాఠశాలకు మంచి పేరు తేవాలని కోరారు.అదేవిధంగా మన పాఠశాలకు ఉచితంగా స్టడీ మెటీరియల్ అందజేసిన పూర్వ మండల విద్యాశాఖ అధికారి 2 అయిన శ్రీ జగన్నాథం కి ఎస్టీయు నాయకులు ఎం.సి సుంకన్న ధన్యవాదాలు తెలియజేశారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు శాంత వీర మూర్తి, యునస్ భాష, ఎస్ పోతరాజు, జి దొడ్డ బసప్ప,డి పాండురంగ, బీ టీ ఖలందర్, కె ఆర్ నాగరాజ శెట్టి,వీర శేఖర్ రెడ్డి,జనార్ధన్, కృష్ణారెడ్డి,తిప్పే స్వామి,కే శ్రీనివాసులు,వెంకటసుబ్బయ్య, మొదలైన వారు పాల్గొన్నారు.

