NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

విజయవంతంగా గంగమ్మ ఒడికి గణనాథులు

1 min read

నిమజ్జన విజయోత్సవంలో కీలకంగా మున్సిపల్ యంత్రాంగం

కర్నూలు, న్యూస్​ నేడు:  కర్నూలు నగరంలో వినాయక నిమజ్జనోత్సవాలు అంగరంగ వైభవంగా విజయవంతంగా పూర్తయ్యాయి. కేసి కెనాల్ వినాయక ఘాట్, స్టాంటన్‌పురం నిమజ్జన స్థలాల్లో భక్తులకు ఎటువంటి అంతరాయం లేకుండా నిమజ్జనం జరగేందుకు నగరపాలక సంస్థ విస్తృత ఏర్పాట్లు చేసింది.గత నెల రోజులుగా కమిషనర్ పి. విశ్వనాథ్ గారి ఆదేశాలు, సూచనల మేరకు కార్పొరేషన్ అధికారులు, సిబ్బంది నిబద్ధతతో విధులు నిర్వర్తించారు. పారిశుద్ధ్య సిబ్బంది, ఇంజినీరింగ్ అధికారులు, ప్రత్యేక పర్యవేక్షకులు సమన్వయంతో పని చేశారు. ఘాట్ల వద్ద శుభ్రత, లైటింగ్, సౌండ్ సిస్టమ్, త్రాగునీరు, మొబైల్ టాయిలెట్లు వంటి అవసరమైన అన్ని సదుపాయాలను సమకూర్చారు.వినాయక ఘాట్ వద్ద 7 క్రేన్లు, స్టాంటన్‌పురం వద్ద 2 క్రేన్లు ఏర్పాటు చేశారు.16 చోట్ల తాగునీటి పాయింట్లు ఏర్పాటు చేశారు.ప్రతి ఘాట్ వద్ద మూడు షిఫ్ట్‌ల వారీగా అధికారులు, సిబ్బంది పర్యవేక్షణ నిర్వహించారు.భక్తులందరూ ప్రశాంత వాతావరణంలో నిమజ్జన కార్యక్రమం పూర్తి చేసినందుకు సహకరించినందుకు కమిషనర్ ధన్యవాదాలు తెలిపారు.ప్రత్యేకంగా పారిశుద్ధ్య సిబ్బంది గత వారం రోజులుగా ఉదయం నుంచి రాత్రి వరకు, నిమజ్జనం రోజున షిఫ్ట్‌ల వారీగా విధులు నిర్వర్తించారు. చివరి విగ్రహం నిమజ్జనం వరకు ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా శ్రమించారు. చెత్తా వెంటనే తొలగించి, ఘాట్ల వద్ద శుభ్రతను కాపాడారు. ప్రధాన రహదారులు సహా నగరమంతటా వందలాది కార్మికులు విధులు నిర్వర్తించారు.మున్సిపల్ సిబ్బందికి ప్రజల ప్రశంసలు లభిస్తున్నాయి. వారిది కేవలం విధి నిర్వహణ మాత్రమే కాకుండా, సేవాభావంతో చేసిన కృషి అని కొనియాడుతున్నారు. నగర అభివృద్ధి, పండుగల విజయవంతమైన నిర్వహణలో వారి పాత్ర కీలకమైనది.

About Author