NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

11 మంది ఎన్. సి. సి. విద్యార్థులకు గోల్డ్ మెడల్

1 min read

కర్నూలు, న్యూస్​ నేడు:  కర్నూలు లోని స్థానిక ఉస్మానియా కళాశాలలో ఎన్. సి. సి. విద్యార్థులు ఈనెల 1వ తేదీ నుండి 10వ తేదీ వరకు అనంతపూర్ జిల్లా బ్రాహ్మణపల్లిలో జరిగిన సీఏటీసీ 8వ క్యాంపు లో ఉస్మానియా కళాశాల విద్యార్థులు 20 మంది క్యాంపులో పాల్గొనగా అందులో 11 మంది విద్యార్థులు అద్భుత ప్రతిభ కనబరిచి గోల్డ్ మెడల్ సాధించారు. ఇందులో స్పీచ్ క్యాంప్ సీనియర్ గేమ్స్ అండ్ కల్చరల్ వంటి విభాగాల్లో  11 మంది ఎన్. సి. సి. విద్యార్థులకు గోల్డ్ మెడల్ రావడం జరిగింది.ఈ సందర్భంగా కళాశాల కరెస్పాండెంట్ అండ్ సెక్రటరీ శ్రీమతి అజర జాబితా మేడం మరియు కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ సయ్యద్ సమీవుద్దీన్ ముజమీల్  గోల్డ్ మెడల్ సాధించిన విద్యార్థులను కళాశాలలో ఘనంగా సన్మానించి అభినందించారు. ఈ కార్యక్రమంలో ఎన్. సి. సి. ఆఫీసర్ Lt S. గౌస్ పీరా మరియు ఎన్.సి.సి.  విద్యార్థులు పాల్గొన్నారు.

About Author