ఉప్పలదడియ’లో గుడ్ ఫ్రైడే వేడుకలు
1 min read

పేద మహిళలకు దుస్తుల పంపిణీ-ఫాదర్ మధుబాబు ఆధ్వర్యంలో సిలువ యాత్ర
మిడుతూరు న్యూస్ నేడు: నంద్యాల జిల్లా మిడుతూరు మండలంలో గుడ్ ఫ్రైడే వేడుకలు ఘనంగా జరిగాయి. మండలంలోని ఆర్ సీఎం,సీఎస్ఐ,ఏబీఎం తదితర సంఘాల్లో క్రైస్తవులు శుక్రవారం గుడ్ ఫ్రైడే వేడుకల్లో ప్రత్యేకంగా ప్రార్థనలో పాల్గొన్నారు. మండల పరిధిలోని ఉప్పలదడియ ఆర్ సిఎం విచారణ గురువులు ఫాదర్ డి మధుబాబు ఆధ్వర్యంలో ఉప్పలదడియ దేవాలయం నుండి దిగువపాడు గట్టు పైనున్న కల్వరికొండ దేవాలయం వరకు రోడ్డు మార్గాన క్రైస్తవులు నడుచుకుంటూ సిలువను భుజాన వేసుకుని ఏసుక్రీస్తు సిలువపై పడిన 14 స్థలాలను స్మరించుకుంటూ సిలువ యాత్రను చేపట్టారు.చివరగా దిగువపాడు కల్వరికొండ దేవాలయంలో ఫాదర్ మధుబాబు మానవుల కొరకు ఏసుక్రీస్తు సిలువపై పడిన శ్రమల గురించి వివరిస్తూ దివ్య బలిపూజను సమర్పించారు.
పేద మహిళలకు దుస్తుల పంపిణీ
విచారణలోని 10 గ్రామాల పేద మహిళలకు కర్నూలుకు చెందిన మానస,రామకృష్ణ సహకారంతో ఫాదర్ మధుబాబు 130 మంది మహిళలకు దుస్తులను పంపిణీ చేశారు.ఈ సిలువ యాత్రలో ఉప్పలదడియ, కలమందలపాడు,మాసపేట దిగువపాడు,కడుమూరు,49 బన్నూరు,చౌటుకూరు దేవనూరు,పైపాలెం,కేతవరం గ్రామాల క్రైస్తవులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.ఈ కార్యక్రమంలో బ్రదర్ థోమాస్,సుపీరియర్ సిస్టర్ సహాయరాణి,ఏఎస్ఐ సుబ్బయ్య, కర్నూలు గౌసియా,ఇబ్రహీం,ఏసన్న స్వామినాథం,సిద్దయ్య,హరి పక్కిరయ్య,బేబమ్మ,ప్రసాద్, బాబు తదితరులు పాల్గొన్నారు.


