గోసేవ చాలా గొప్పది.. : టిజి భరత్
1 min read

పల్లెవెలుగు వెబ్: గాయత్రి గోశాల నిర్వహణ చాలా బాగుందని టీజీవి సంస్థల చైర్మన్ టిజి భరత్ అన్నారు. శుక్రవారం నగరంలోని మౌర్య ఇన్ లో గాయత్రి గోసేవ సమితి 2022 నూతన సంవత్సర క్యాలెండర్ ను టిజి భరత్ ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ గోశాలకు తాము ఎప్పుడు అండగా ఉంటామని చెప్పారు. క్యాలెండర్లు గోశాల దాతలకు ఉచితంగా అందజేస్తున్నట్లు నిర్వాహకులు భరత్ కు తెలిపారు. ఈ కార్యక్రమంలో గోశాల అధ్యక్షుడు జగదీష్ గుప్త, ప్రధాన కార్యదర్శి ఇల్లూరు లక్ష్మయ్య, ట్రెజరర్ ఇల్లూరు రాజ్యలక్ష్మి, గౌరవాధ్యక్షులు విజయ్ కుమార్, జాయింట్ సెక్రటరీ హరి ప్రసాద్, సభ్యులు పాల్గొన్నారు.

