NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

మైనార్టీ కాలనీ ని అభివృద్ధి చేయడంలో విఫలం చెందిన ప్రభుత్వాలు,పాలకులు

1 min read

ఎమ్మిగనూరు కాంగ్రెస్ పార్టీ కోఆర్డినేటర్ కాసిం వలి

ఎమ్మిగనూరు న్యూస్ నేడు : ఎమ్మిగనూరు పట్టణ పరిధిలోని మైనారిటీ కాలనీ అభివృద్ధి చేయడంలో గత పాలకులు, ప్రస్తుత పాలకులు పూర్తిగా విఫలం చెందారని కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ కోఆర్డినేటర్ కాసిం వలి ఆధ్వర్యంలో కాలనీ స్థితిగతులపై ర్యాలీ నిర్వహించి, అక్కడ ప్రజలు పడుతున్న కష్టాలను తెలుసుకున్నారు. కాలనీలో అధ్వానంగా రోడ్లు ఉన్నాయని, డ్రైనేజ్ సమస్య తీవ్రంగా ఉందని, తాగునీటి సౌకర్యం కూడా చాలా ఇబ్బందిగా ఉందని, మైనార్టీ కాలనీకి చెందిన భూమిని కొంతమంది కబ్జాదారులు కబ్జా చేస్తున్న అధికారులు పాలకులు పట్టించుకోవడం లేదన్నారు. కొంతమంది పాలకులు మైనార్టీలకు ఇచ్చిన పట్టాలను అమ్ముకుని స్వాహా చేస్తున్నారని, దీనిపైన విచారణ జరపాలని కోరారు. కాలనీలో వర్షం వస్తే రోడ్లు బురద మయంగా మారి ప్రజలు తిరగడానికి, విద్యార్థులు యువత వాహనదారులు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారని, గత పది సంవత్సరాలుగా తాగునీటి కోసం ఏర్పాటు చేసిన వాటర్ ట్యాంక్ మధ్యలోనే ఆఫీ వేయడం చాలా దారుణం అన్నారు. మైనార్టీ కాలనీకు తాగునీటిని మున్సిపల్ నుంచి వచ్చే నీటినివిడుదల చేయాలని తెలిపారు. ప్రస్తుతం బోర్ ద్వారా అందిస్తున్నారని అవి కాలనీకి ఏమాత్రం సరిపోవడం లేదని తెలిపారు. కాలనీ ని అభివృద్ధి చేయడంలో అధికారులు పాలకులు పూర్తిగా విఫలం చెందారని తెలిపారు. రోడ్ల స్థితి చాలా అధ్వానంగా ఉందని దీనిపైన తక్షణమే అధికారులు స్పందించి రోడ్లు వేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు ఆసిఫ్, హజరత్ వలి, షబ్బీర్,షాకిర్,అజయ్, తదితరులు పాల్గొన్నారు.

About Author