IIITDM కర్నూలులో డాక్టరేట్ సాధించిన జి. పుల్లయ్య అధ్యాపకురాలు ఫౌజియా సుల్తానా
1 min read
– స్మార్ట్ రవాణాకు కొత్త దారి!
కర్నూలు, న్యూస్ నేడు: స్థానిక జి.పుల్లయ్య కళాశాల అధ్యాపకురాలు ఎస్.ఫౌజియా సుల్తానా ఐఐఐటిడిఎం కర్నూలులో ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ విభాగంలో పిహెచ్డి పూర్తి చేసి డాక్టరేట్ పట్టాను అందుకున్నారు. ఆమె పరిశోధనకు అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ కరంతొట్ కృష్ణ నాయక్ మార్గదర్శకత్వం వహించారు. ఆమె థీసిస్ శీర్షిక వెహిక్యులర్ అడ్ హాక్ నెట్‌వర్క్‌లలో నమ్మకమైన కమ్యూనికేషన్ మరియు క్యూఓఎస్ ఆప్టిమైజేషన్ కోసం ఒక ఫ్రేమ్‌వర్క్. ఈ పరిశోధన సమాజానికి ఎంతో ఉపయోగపడుతుంది. వాహనాల మధ్య వేగవంతమైన సురక్షిత సమాచార మార్పిడి వల్ల రోడ్డు ప్రమాదాలు తగ్గుతాయి. అంబులెన్స్ ఫైర్ ఇంజన్ వంటి అత్యవసర వాహనాలకు దారి సులభమవుతుంది. ట్రాఫిక్ రద్దీ తగ్గి సమయం ఇంధనం ఆదా అవుతాయి. కాలుష్యం తగ్గి స్మార్ట్ సిటీల అభివృద్ధికి దోహదపడుతుంది. ప్రయాణికుల భద్రత పెరిగి డ్రైవర్లకు ముందస్తు హెచ్చరికలు అందుతాయి. రోడ్లపై సమాచార ప్రసారం మరింత నమ్మకంగా వేగంగా జరుగుతుంది. సందర్భంగా జి.పుల్లయ్య కళాశాల యాజమాన్యం, అధ్యాపకులు,విద్యార్థులు మరియు ఐఐఐటిడిఎం అధ్యాపకులు ఆమెను హృదయపూర్వకంగా అభినందించారు. ఆమె కృషి పట్టుదల అంకితభావం యువ పరిశోధకులకు స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు.


