కోనేటమ్మ పల్లె’లో బీటీ రోడ్డుకు భూమి పూజ
1 min read

భూమి పూజ చేసిన మాండ్ర..ఎమ్మెల్యే గిత్త
నందికొట్కూరు, న్యూస్ నేడు: నంద్యాల జిల్లా నందికొట్కూరు మండల పరిధిలోనికోనేటమ్మ పల్లెలో నూతనంగా చేపటనున్న బీటీ రోడ్డు నిర్మాణ పనులను ఒక కోటి 90 లక్షలతో డిఎంఎఫ్(డిస్ట్రిక్ట్ మినరల్ ఫౌండేషన్) నిధులతో చేపట్టనున్న రోడ్డుకు నందికొట్కూరు ఎమ్మెల్యే గిత్త జయసూర్య మరియు మాండ్ర శివానందరెడ్డి ప్రత్యేకంగా పూజలు చేసి రోడ్డుకు భూమి పూజ చేశారు.ముందుగా వీరికి గ్రామ సర్పంచ్ పోతుల దామోదర్ రెడ్డి ఆధ్వర్యంలో ఘన స్వాగతం పలికారు.ఈ రోడ్డు కోనేటమ్మ పల్లె నుండి ర్యాలంపాడు వరకు వేయనున్నారు.రోడ్డు నిర్మాణ పనులు నాణ్యతతో త్వరగా పూర్తిచేయాలని కాంట్రాక్టర్ ను ఎమ్మెల్యే ఆదేశించారు.ఈ కార్యక్రమంలో మాండ్ర సురేంద్రనాథ్ రెడ్డి,ప్రసాద రెడ్డి, హారిసర్వోత్తమరెడ్డి,భాస్కర్ రెడ్డి,సత్యం రెడ్డి, రామచంద్రుడు తదితరులు పాల్గొన్నారు.

